పొద్దున్నే ముగ్గురు కుటుంబ సభ్యులను హతమార్చి బావిలో పడేసిన మైనర్.. అరెస్టు

Published : Nov 06, 2022, 03:15 PM IST
పొద్దున్నే ముగ్గురు కుటుంబ సభ్యులను హతమార్చి బావిలో పడేసిన మైనర్.. అరెస్టు

సారాంశం

త్రిపురలో ఓ ఒడిశా మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కన్నతల్లిని, సోదరిని, తాతను చంపేశాడు. ఓ పొరుగు వ్యక్తిని కూడా హతమార్చాడు. శనివారం ఉదయమే ఈ నేరానికి పాల్పడినట్టు తెలుస్తున్నది.  

అగర్తలా: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో దారుణం జరిగింది. ఒడిశాకు చెందిన ఓ మైనర్ బాలుడు తన కుటుంబానికే చెందిన ముగ్గురిన హతమార్చాడు. పొరుగునే ఉండే మరో వ్యక్తిని కూడా చంపేసి వారి డెడ్ బాడీలను ఇంటి ప్రాంగణంలోని బావిలో పడేశాడు. ఆ తర్వాత ఊరు విడిచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంతలో పోలీసులు విషయం తెలుసుకుని బాలుడిని అరెస్టు చేశారు.

త్రిపురలోని దలాయ్ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు వివరాల ప్రకారం, ‘ప్రాథమిక సమాచారం ద్వారా తమకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. కమల్‌పూర్ సబ్ డివిజన్‌లో నివసిస్తున్న ఆ మైనర్ అబ్బాయి (16 ఏళ్లు) రోటీన్‌గా డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఆ బాలుడు తన తల్లిని, తాతను, పదేళ్ల సోదరిని చంపేశాడు. పొరుగునే ఉండే మరో వ్యక్తిని కూడా శనివారం ఉదయం చంపేశాడు. ఇంటి నుంచి తన తండ్రి బయటికి వెళ్లిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే, ఈ నేరం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి అనేది ఇంకా తెలియరాలేదు’ అని వివరించారు.

Also Read: అడవిలో మహిళ మృతదేహం.. చంపేసి, గుట్టు చప్పుడు కాకుండా పూడ్చేసీ..

తండ్రి తిరిగి ఇంటికి చేరగానే అక్కడి దృశ్యాలు చూసి హతాశయుడయ్యాడు. ఇంటిలో రక్తం వెదజల్లి ఉన్నది. ఇంటికి పక్కనే ఉండే బావిలో వారి డెడ్ బాడీలు కనిపించాయి. రక్తపు మరకలు చూసి బిగ్గరగా అరిచాడు. ఇతరులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఘటన గురించి పోలీసులకు వివరించారు.

ఈ రోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఇంటిలో ఎక్కువ శబ్దంతో మ్యూజిక్ ప్లే చేశారని స్థానికులు తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడుతుండగా.. అరుపులు బయటకు వినరాకుండానే మ్యూజిక్ హై వ్యాల్యూమ్‌లో పెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.

శనివారం సాయంత్రం ఆ మృతదేహాలను రికవరీ చేశారు. పోస్టుమార్టం కోసం పంపినట్టు పోలీసులు వివరించారు.

మృతదేహాలపై గాయాల మరకలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆ నాలుగు మృతదేహాలపై గాయాలు ఉన్నాయని, బహుశా పదునైన ఆయుధంతో గాయపరిచి హత్య చేశాడేమో అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే, వారు ఎలా మరణించారనే విషయం పోస్టుమార్టం నివేదిక వెల్లడిస్తుందని అధికారులు తెలిపారు. నిందితుడు గ్రామం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు ఆ మైనర్ బాలుడిని పట్టుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Jallikattu : రక్తచరిత్ర కాదు.. ఇది రక్తం మరిగే ఆట.. జల్లికట్టు గురించి తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ !
Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu