లేడీ ఐఎఎస్‌కు అసభ్య మేసేజ్‌లు: మంత్రిపై సీఎంకు ఫిర్యాదు

Published : Oct 25, 2018, 07:04 PM IST
లేడీ ఐఎఎస్‌కు అసభ్య మేసేజ్‌లు: మంత్రిపై సీఎంకు ఫిర్యాదు

సారాంశం

తనకు  ఓ మంత్రి అభ్యంతరకర మేసేజ్‌‌లను పంపుతున్నారని   లేడీ ఐఎఎస్ అధికారిణి  పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు


చంఢీఘడ్: తనకు  ఓ మంత్రి అభ్యంతరకర మేసేజ్‌‌లను పంపుతున్నారని   లేడీ ఐఎఎస్ అధికారిణి  పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై  మంత్రిపై చర్యలు తీసుకొనేందుకు సీఎం రంగం సిద్దం చేసుకొంటున్నారని తెలుస్తోంది.

పంజాబ్ లో విధులు నిర్వహిస్తున్న ఐఎఎస్ అదికారిణి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు  తనకు మంత్రి పంపిన అసభ్యకర మేసేజ్‌లను కూడ ముఖ్యమంత్రికి పంపారని సమాచారం.

అసభ్యమేసేజ్‌లు పంపడంపై ఐఎఎస్ అధికారిణి మంత్రికి ఇదివరకే వార్నింగ్ ఇచ్చినా కూడ తన ధోరణిని మార్చుకోలేదు.దీంతో  ఆమె సీఎంకు ఫిర్యాదు చేసింది.అంతేకాదు  ఈ విషయం ఎఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ దృష్టికి కూడ వెళ్లినట్టు సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం