బీజేపీకి కొత్త తలనొప్పి.. అత్యాచారం కేసులో కేంద్ర మంత్రి

By ramya neerukondaFirst Published Aug 11, 2018, 10:37 AM IST
Highlights

ఇలాంటి సమయంలో మరో తలనొప్పి వచ్చి పడింది. రైల్వే శాఖ సహాయ మంత్రి  రాజెన్ గోహెన్ పై రేప్ కేసు నమోదైంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే కథువా రేప్, బిహార్ షెల్టర్ హోమ్ అత్యాచారాలు, యూపీ షెల్టర్ హోమ్ లోని బాలికలపై అత్యాచారాల ఘటనలు బీజేపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాగా.. ఇలాంటి సమయంలో మరో తలనొప్పి వచ్చి పడింది. రైల్వే శాఖ సహాయ మంత్రి  రాజెన్ గోహెన్ పై రేప్ కేసు నమోదైంది. అస్సోం పోలీసులు ఐపీసీ 417( మోసం), ఐపీసీ 376, ఐపీసీ506( నేరపూరిత బెదిరింపులు) సెక్షన్ల కింద మంత్రిపై కేసు నమోదు చేశారు.

నాగోన్ పోలీసు స్టేషన్ లో ఓ 24ఏళ్ల వివాహిత మంత్రిపై రేప్ కేసు పెట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే.. దీనికి ప్రతిగా సదరు మహిళ, ఆమె కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నదని గోహెన్ వారిపై మరో ఫిర్యాదు చేశారు.

దీంతో.. బాధిత మహిళ తన కేసును ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె కేసు ఉపసంహరించుకున్నప్పటికీ.. దీనిపై దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతుండటం గమనార్హం. 

click me!