
నేటీ ప్రపంచంలో మహిళలు పురుషులతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ.. వివిధ రంగాల్లో తనదైన సత్తా చాటుతున్నారు. క్రీడా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మహిళలు తనదైన ముద్ర వేస్తున్నారు. సమాజాభివృద్దిలో తాము కూడా కీలకమేననీ, కుటుంబాన్ని చూసుకుంటూనే వ్యాపారం, ఉద్యోగం ఇలా భిన్నమైన రంగాల్లో తనదైన పాత్ర పోషించగలమని నిరూపిస్తున్నారు.
సమాజంలో ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా.. వాటన్నింటిని అధిగమిస్తూ తన విధులను నిర్వహిస్తున్నారు నేటీ స్త్రీ మూర్తులు. నేడు బుధవారం మార్చి 8 ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ సందర్బంగా భారత వైమానిక దళం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. యుద్ధభూమిలో నిర్వహించే విధులకు తొలిసారిగా మహిళను నియమించింది.
వివరాల్లోకి వెళితే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని పశ్చిమ విభాగంలో గ్రూప్ కెప్టెన్ గా విధులు నిర్వహిస్తున్న షాలిజ ధామిని పాకిస్థాన్ సరిహద్దులో మిస్సైల్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా నియమించింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోగ్రూప్ కెప్టెన్ గా ఉంటున్న షాలిజా ధామి .. ఇలా కీలకమైన కంబాట్ యూనిట్ బాధ్యతలు నిర్వహించనున్న తొలి మహిళగా ధామి చరిత్ర సృష్టించారు. మహిళలకు యుద్ద రంగంలో పురుషులతో సమానంగా అత్యున్నతమైన బాధ్యతలను అప్పగించాలని.. మహిళా దినోత్సవం సందర్భంగా ఐఏఎఫ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక షాలిజా ధామిని కెరీర్ విషయానికి వస్తే..గ్రూప్ కెప్టెన్ ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా వాయుసేనలో అడుగుపెట్టింది. ఆమెకు 2,800 గంటలకు పైగా విమానయాన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఆమె వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా పనిచేశారు. రెండు పర్యాయాలు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ చేత ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ యొక్క ఆపరేషన్స్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తునారు.
IAFలో గ్రూప్ కెప్టెన్ ఆర్మీలో కల్నల్‌తో సమానం. భారత వైమానిక చరిత్రలో ఇదో గొప్ప కీలక పరిణామమనీ చెప్పాలి. యుద్ద భూమిలో మహిళా అధికారులను నియమించడం ఓ మైలురాయి.. మహిళా ఆఫీసర్ నాయకత్వంలో సాయుధ బలగాలను ముందుకు నడిపించడం గొప్ప విషయమే.