బాబ్రీ వివాదం: నివేదికకు గడువు కోరిన మధ్యవర్తుల కమిటీ

By narsimha lodeFirst Published May 10, 2019, 10:58 AM IST
Highlights

:రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు గాను  ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు సమయం ఇవ్వాలని మధ్య వర్తుల కమిటీ సుప్రీం కోర్టును కోరింది.


న్యూఢిల్లీ:రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు గాను  ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు సమయం ఇవ్వాలని మధ్య వర్తుల కమిటీ సుప్రీం కోర్టును కోరింది. మధ్యవర్తుల కమిటీ  ఈ నెల 7వ తేదీన సుప్రీం కోర్టుకు మధ్యవర్తుల కమిటీ నివేదిక అందించింది.

రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు శుక్రవారం నాడు విచారణ జరిపింది. మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను ఇచ్చినట్టుగా కోర్టు ప్రకటించింది.
ఈ ఏడాది ఆగష్టు 15వ తేదీ వరకు తమకు సమయం ఇవ్వాలని మధ్యవర్తుల కమిటీ సుప్రీంకోర్టును కోరినట్టుగా సీజేఐ ప్రకటించారు.

ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎఫ్ఎం కలీఫుల్లాతో పాటు రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచ్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు.అయోధ్యకు ఇంకా పరిష్కారాన్ని కమిటీ చూపలేదని హిందూ మహాసభ అభిప్రాయపడుతోంది. మధ్య వర్తుల కమిటీకి గడువు పెంచడాన్ని  ముస్లింలు స్వాగతించారు.

click me!