తగ్గిపోయిందనుకున్న కరోనా వైరస్ దేశంలో మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. గత కొద్ది రోజులుగా అక్కడ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.
తగ్గిపోయిందనుకున్న కరోనా వైరస్ దేశంలో మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. గత కొద్ది రోజులుగా అక్కడ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది.
దీంతో రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలను భాగస్వాముల్ని చేయాలని ముంబై నగర మేయర్ కిశోరి పెడ్నేకర్ నడుం బిగించారు.
undefined
దీనిలో భాగంగా నగరవాసులు కలిసి కట్టుగా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి నగరంలో రాత్రి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని.. రద్దీగా ఉన్న మార్కెట్లను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని కిశోరి చెప్పారు.
కరోనా మార్గదర్శకాలు పాటించి లాక్‌డౌన్ గండాన్ని తప్పించుకునే బాధ్యత ముంబయివాసులపై ఉందని ఆమె తెలిపారు. వార్డు స్థాయిలో వాలంటీర్లు కొవిడ్-19 పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని కిశోరి వెల్లడించారు.
మరోవైపు దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 65శాతం ఒక్క మరాఠా గడ్డపైనే ఉండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35,871 మంది వైరస్ బారిన పడగా.. ఇందులో 23,179 కేసులు (64.6శాతం) మహారాష్ట్ర నుంచే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొత్త కేసుల్లో 80శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే వెలుగుచూస్తున్నట్లు తెలిపింది. ఇక దేశంలో ప్రస్తుతం 2,52,364 యాక్టివ్ కేసులుండగా.. ఇందులో 1.52 లక్షల క్రియాశీల కేసులు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం.