ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. గార్మెంట్ షోరూమ్‌లో చెలరేగిన మంటలు..

Published : Feb 01, 2023, 09:38 AM IST
ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. గార్మెంట్ షోరూమ్‌లో చెలరేగిన మంటలు..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మధురలోని మూడు అంతస్తుల భవనంలోని గార్మెంట్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి.

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మధురలోని మూడు అంతస్తుల భవనంలోని గార్మెంట్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. వివరాలు.. కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధోలి పయావులో ఉన్న మహేష్‌ గార్మెంట్స్‌ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించడంతో లక్షల రూపాయల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. 

‘‘భవనంలోని మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. 6 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇప్పుడు మంటలు అదుపులో ఉన్నాయి, మేము మంటలను ప్రక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించకుండా చూశాం’’ అని అగ్నిమాపక అధికారి చెప్పారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ అనే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 14 మంది మరణించారు. ఇందులో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు, ఒక వృద్ధుడు ఉన్నారు. అదే సమయంలో 35 మందికి పైగా రక్షించబడ్డారు. వారిలో పలువురి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అగ్ని ప్రమాదం తీవ్రత చూస్తోంటే.. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక అధికారవర్గాలు తెలిపాయి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే.. కానీ మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CJP: ఇది మొద‌టి వికెట్ మాత్ర‌మే.. పోరాటం ఇంకా ఉంది. కాక్రోచ్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న
ఎవ‌రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌.? ఆయ‌న బ్యాగ్రౌండ్ ఏంటి.? రాజ‌కీయాల్లోకి ఎలా వ‌చ్చారు.?