జామియా మసీదులో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. 

By Rajesh KarampooriFirst Published Nov 17, 2022, 10:36 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని ద్రాస్ ప్రాంతంలో ఉన్న మసీదులో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఖదీమ్ హన్ఫియా జామియా మసీదు షరీఫ్ ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు, సైన్యం ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని ద్రాస్‌లో ఉన్న జామియా మసీదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ ఆర్మీ, పోలీస్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ వారు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. మంటల కారణంగా జామియా మసీదుకు భారీ నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం కారణంగా మసీదులో చాలా భాగం దగ్ధమైందని చెబుతున్నారు. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. 
 
జామియా మసీదు నిర్వహకుడు మీడియాతో మాట్లాడుతూ.. ద్రాస్‌లోని పురాతన మసీదులలో దురదృష్టకర అగ్ని ప్రమాదం గురించి వినడం బాధాకరమని అన్నారు.మసీదుకు జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేస్తూ.. స్థానిక పరిపాలకులను నిందించారు. ద్రాస్ సున్నిత ప్రాంతమని,అక్కడ  అగ్నిమాపక సేవలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా సమైక్య రాష్ట్రంలో పరిపాలన ఏమీ నేర్చుకోలేదని విమర్శించారు. అగ్నిప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

జామియా మసీదులో జరిగిన అగ్నిప్రమాదం గురించి  స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ వాహనాలను అక్కడికి తరలించారు. ఆర్మీ, స్థానిక పోలీసులు, అత్యవసర విభాగం సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో  మసీదు చాలా నష్టపోయింది.

మంటల కారణంగా మసీదు పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు చెబుతున్నారు. మసీదు లోపల ఉన్నవన్నీ దగ్దమయ్యాయి.  మసీదులో పలు నిర్మాణాలు చెక్కతో తయారు చేయడంతో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి మంటలు వ్యాపించాయి. సరైన సమయంలో మంటలను అదుపు చేయలేకపోవడంతో చాలా వేగంగా వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రాలు .సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మసీదు చాలా వరకు దగ్ధమైపోయింది.

click me!