ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం: 1500 ఇళ్లు అగ్నికి ఆహుతి

By narsimha lodeFirst Published May 26, 2020, 11:15 AM IST
Highlights

ఢిల్లీలోని  తుగ్టకాబాద్ మురికివాడలో మంగళవారం నాడు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో సుమారు 1500 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 
 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని  తుగ్టకాబాద్ మురికివాడలో మంగళవారం నాడు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో సుమారు 1500 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 

సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడలో మంగళవారం నాడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం  నాడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదకశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.  28 అగ్ని మాపక కేంద్రాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పాయి. 

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఇళ్లలో నిద్రిస్తున్న వారిని బయటకు  తీసుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. 1500 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు.

అగ్ని ప్రమాదంతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వాధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాడు తెల్లవారుజామున ఒంటి గంటకు తమకు స్థానికుల నుండి సమాచారం అందిందని సౌత్ ఈస్ట్ డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా చెప్పారు.ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడ ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకొన్నామని ఆయన తెలిపారు.

ఢిల్లీలో ఇటీవల కాలంలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలతో పాటు, మార్కెట్లలో కూడ గతంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.ఈ ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టం కూడ సంభవించిన విషయం కూడ తెలిసిందే.

click me!