Fire breaks out at Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

Published : Apr 14, 2022, 04:08 PM IST
Fire breaks out at Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

సారాంశం

Fire breaks out at Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. పంజాబీ బాగ్‌లోని క్లబ్ రోడ్‌లోని ట్రాయ్ లాంజ్ అండ్ బార్‌లో మధ్యాహ్నం 1.35 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పుతున్నాయి. 

Fire breaks out at Delhi:  దేశ‌రాజ‌ధానిలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలోని రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు తెలిపారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు కొన‌సాగించారు. 

"పంజాబీ బాగ్‌లోని క్లబ్ రోడ్‌లోని ట్రాయ్ లాంజ్ అండ్ బార్‌లో మధ్యాహ్నం 1.35 గంటలకు అగ్నిప్రమాదం సంభ‌వించిన  ఘ‌ట‌న గురించి మాకు కాల్ వచ్చింది. వెంట‌నే మూడు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి" అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్  వెల్ల‌డించారు. అగ్ని ప్ర‌మాద తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో మరో తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.

 

ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లోని ట్రాయ్ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో రెస్టారెంట్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. అందులో ఉన్నవారు వెంట‌నే బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అయితే,  ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

 

PREV
click me!

Recommended Stories

Moon Earth : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu