ముంబైలో రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను అదుపు చేస్తున్న నాలుగు ఫైరింజన్లు

Published : Dec 15, 2022, 12:22 PM IST
ముంబైలో రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను అదుపు చేస్తున్న నాలుగు ఫైరింజన్లు

సారాంశం

మహారాష్ట్ర ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో మంటలు చెలరేగాయి.

మహారాష్ట్ర ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో మంటలు చెలరేగాయి. భవనంలోని 22వ అంతస్తులో ఉదయం 10:45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఘటన స్థలంలో అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. 

అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టుగా నివేదించబడలేదు. అగ్నిప్రమాదం వల్ల దట్టమైన పొగ వెలువడుతుంది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bank Holidays 2026: ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ విడుదల.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్!
New Year: 2026.. ఈ నెంబ‌ర్ చాలా స్పెష‌ల్‌, 20 ఏళ్లకు ఒక‌సారే ఇలా జ‌రుగుతుంది