
చెన్నై : ప్రియురాలి మీద స్నేహితులతో కలిసి rape attemptకి పాల్పడ్డాడో కిరాతక ప్రియుడు. ఈ దారుణమైన ఘటన నామక్కల్ లో వెలుగుచూసింది. bihar కు చెందిన ఓ యువతి నామక్కల్ లోని వేప్పేడులోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న బాల్ రాజ్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే, ఆదివారం సెలవు కావడంతో ప్రియురాలికి మాయమాటలు చెప్పి తన ఇంటికి బాల్ రాజ్ తీసుకెళ్లాడు.
ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసిన ఆమె మీద బాలరాజు లైంగికదాడి చేశాడు. అంతే కాదు మిత్రులు ప్రదీప్, మనోజ్ కు అప్పగించాడు. ముగ్గురు కలిసి ఆమె మీద పలుమార్లు సామూహిక లైంగిక దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పింది. ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఆందోళన చెందిన అక్కడి నుంచి ఆ ముగ్గురు ఉడాయించారు.
అర్థరాత్రి వేళ స్పృహలోకి వచ్చిన ఆ యువతి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బీహార్ కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఇదిలా ఉండగా, డిసెంబర్ 18న హైదరాబాద్ లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను బెదిరించిన ప్రబుద్ధుడు.. ప్రియుడి ముందే ఆమెపై rape attemptకి పాల్పడ్డాడు. అవమానం భారం భరించలేక బాధితురాలు, ఆమె ప్రియుడు వికారాబాద్ సమీపంలో విషం తాగి suicideకు యత్నించారు. ఎస్ ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లాకు చెందిన మహిళ (32)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
యూట్యూబ్ లో చూసి ఇంట్లోనే డెలివరీ చేసిన భర్త... శిశువు మృతి, భార్య పరిస్థితి విషమం
భర్తతో కలిసి కూలీ పనులు చేసుకునే మహిళ... బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి (22) తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త Extramarital affairకి దారితీసింది. ఈ క్రమంలో ఈ నెల 13న రాత్రి మహిళ ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. కాసేపటి తరువాత తిరిగి వెళ్తుండగా అదే ప్రాంతంలో ఉంటున్న ఇస్మాయిల్ (23), మరో బాలుడు (17) ప్రియుడిని అటకాయించారు. ప్రియుని వద్ద ఫోన్ లాక్కునే బెదిరించారు. ఈ అలికిడితో మహిళ బయటకు వచ్చింది.
మీ వివాహేతరబంధం బయటపెడతానని ఆమెను బెదిరించి ఇస్మాయిల్.. ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇంకో దారుణం ఏంటంటే.. ఈ అత్యాచార దృశ్యాలను నిందితుడితో ఉన్న మరో బాలుడు వీడియోలో చిత్రీకరించారు. తమ పని పూర్తయిన తరువాత నిందితులు వెళ్ళిపోతూ.. ప్రియుడికి ఫోన్ ఇచ్చేశారు. అయితే తమకు జరిగిన ఈ అవమానంతో ఆ మహిళ, ప్రియుడు ఆత్మహత్య చేసుకుందామని భావించారు. మహిళ ఈ నెల 14న ద్విచక్రవాహనంపై వికారాబాద్ సమీపంలోని కండ్లపల్లి గేటు వద్ద నీలగిరి చెట్ల తోటలోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని అతని సోదరుడికి ఫోన్లో చెప్పాడు.
విషం తాగిన ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లగా... సమాచారం అందుకున్న బాధితుడు సోదరుడు వెంటనే అక్కడకు వచ్చి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం కోలుకున్న బాధితురాలు.. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఇస్మాయిల్, బాలుడి కోసం కోసం గాలిస్తున్నారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.