కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌లు తీవ్రంగా వేధించారు - ఢిల్లీ ఎల్‌జీకి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ

By team teluguFirst Published Jan 13, 2023, 1:49 PM IST
Highlights

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. అందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే మంత్రి సత్యేందర్ జైన్ పై సంచలన ఆరోపణలు చేశారు. 

200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు, తీహార్ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్‌తో పాటు సత్యేందర్‌ జైన్‌పై మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన లేఖలో ఆరోపించారు. కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌లపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నాయని సుకేష్ అన్నారు.

జమ్మూ ఉగ్రదాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప‌రామ‌ర్శ

సత్యేందర్ జైన్ తనను ఫోన్‌లో బెదిరించారని, ఇద్దరిపై దాఖలు చేసిన అన్ని సాక్ష్యాలను ఉపసంహరించుకునేందుకు 48 గంటల సమయం ఇచ్చారని సుకేష్ ఆరోపించారు. జైలు అధికారులు, సిబ్బంది తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. జైలులో ఉన్న సత్యేందర్ జైన్ సాక్ష్యాధారాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని బెదిరించాడని ఆరోపించాడు. హైపవర్ కమిటీ, మీడియాకు ఇచ్చిన అన్ని ప్రకటనలను ఉపసంహరించుకోవడానికి బదులుగా జైన్ తనకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సీటు, పంజాబ్‌లో ఇసుక మైనింగ్ కాంట్రాక్టులను ఆఫర్ చేశారని, అన్ని చాట్‌లు, స్క్రీన్‌షాట్‌లు, వాయిస్ రికార్డింగ్‌లను తనకు అందజేయాలని కోరారని ఆరోపించారు.

పెళ్లైన రెండు నెలలకే యువకుడు ఆత్మహత్య.. అనాథతో ప్రేమవివాహం.. అంతలోనే..

మండోలి జైలులో తనకు భద్రత లేదని చంద్రశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నారు. జైలు నంబర్ 14 సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ జైసింగ్ తనను చంపుతామని బెదిరించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ కూడా తనను చంపేస్తానని బెదిరించారని తెలిపారు. తనకు 2017 నుంచి రాజ్‌కుమార్‌, జై సింగ్‌లు తెలుసునని, తీహార్‌ జైలులో ఉన్నప్పుడు రాజ్‌కుమార్‌కు సుమారు 1.25 కోట్ల రూపాయలు, జై సింగ్‌కు రక్షణ సొమ్ముగా సుమారు 35 లక్షల రూపాయలు ఇచ్చారని సుకేష్ లేఖలో రాశారు. ఈ లంచాన్ని బయటపెట్టినందుకు సత్యేందర్ జైన్ ఆదేశానుసారం ఇద్దరూ నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆ లేఖలో తెలిపారు.

మాజీ మంత్రి శరద్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

తన కేసులో దర్యాప్తును కేంద్ర ఏజెన్సీకి అప్పగించాలని చంద్రశేఖర్ లేఖలో కోరారు. అన్ని నిజాలను బహిర్గతం చేయాలని చెప్పారు. చంద్రశేఖర్ రాన్బాక్సీ మాజీ యజమాని శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో వచ్చిన డబ్బు జాడను దర్యాప్తు చేస్తోంది. 
 

click me!