పెళ్లయినా ప్రియుడిని మరచిపోలేక.. కారు డ్రైవ్ చేస్తూనే ఆత్మహత్య

By sivanagaprasad KodatiFirst Published 10, Sep 2018, 9:24 AM IST
Highlights

తన మాజీ ప్రియుడు కాదన్నాడనే మనస్తాపంతో ఓ వివాహిత కారును డ్రైవ్ చేస్తూనే ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు నగరానికి చెందిన సుమ అనే యువతి ఓ యువకుడిని ప్రేమించింది. 

తన మాజీ ప్రియుడు కాదన్నాడనే మనస్తాపంతో ఓ వివాహిత కారును డ్రైవ్ చేస్తూనే ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు నగరానికి చెందిన సుమ అనే యువతి ఓ యువకుడిని ప్రేమించింది. అయితే సుమ తల్లిదండ్రులు ఆమె ప్రేమించిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.

పెళ్లి జరిగి నెలలు గడుస్తున్నా.. ఆమె మాజీ ప్రియుడిని మరచిపోలేక భర్త దగ్గరి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఆమె తల్లిదండ్రులు తిరిగి నచ్చజెప్పి భర్త దగ్గరకి పంపారు. అయితే ఆమె భర్త ఇంటికి కాకుండా తన ప్రియుడి ఉంటున్న తుముకూరు దగ్గరకు వెళ్లింది.

పెళ్లి చేసుకుని మళ్లీ తన దగ్గరకు ఎందుకు వచ్చావని మాజీ ప్రియుడు సుమను ప్రశ్నించాడు.. అంతేకాకుండా ఆమెతో ఉండేందుకు నిరాకరించాడు. ప్రియుడి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన సుమ కారులో వెళుతూనే నిద్రమాత్రలు మింగింది. స్పృహ కోల్పోయి కారులో తమ ఇంటికి వచ్చిన కుమార్తెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.

Last Updated 19, Sep 2018, 9:17 AM IST