తాగి వేధిస్తున్నాడని.. సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య

Published : Oct 13, 2020, 10:37 AM IST
తాగి వేధిస్తున్నాడని.. సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య

సారాంశం

ఆ కిరాయి హంతకులు ఆమె భర్త జయదీప్ గొంతుకు ఉచ్చు బిగించి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులకు ఆ మహిళపై అనుమానం కలిగి ఆమెను విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది.


తాగి వేధిస్తున్నాడని ఓ మహిళ కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఓ కిరాయి ముఠాకి రూ.50వేలు సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించింది. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రూ. 50 వేల రూపాయలకు సుపారీ కుదుర్చుకుని, భర్తను అత్యంత దారుణంగా హత్యచేయించింది. 35 ఏళ్ల ఆ మహిళ నాగపూర్‌లోని ఇద్దరు కిరాయి హంతకుల సాయంతో ఈ దారుణానికి పాల్పడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్తను హత్యచేసిన చందన్ నథూజీ దివెవార్, సునీల్ మాలవీయ్‌లకు రూ. 50 వేలు ఇచ్చింది. 

ఈ కేసును ఛేధించిన పోలీసులు చందన్‌ను పట్టుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఆ కిరాయి హంతకులు ఆమె భర్త జయదీప్ గొంతుకు ఉచ్చు బిగించి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులకు ఆ మహిళపై అనుమానం కలిగి ఆమెను విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. అలాగే ఆ కిరాయి హంతకుల పేర్లు కూడా పోలీసులకు తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్
Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.