బెంగళూరులో వివాహిత అనుమానస్పద మృతి.. స్కూల్ ఫంక్షన్‌కి వెళ్లొద్దని గొడవ.. భర్తపైనే అనుమానాలు..!

Published : Oct 23, 2022, 11:39 AM IST
బెంగళూరులో వివాహిత అనుమానస్పద మృతి.. స్కూల్ ఫంక్షన్‌కి వెళ్లొద్దని గొడవ.. భర్తపైనే అనుమానాలు..!

సారాంశం

బెంగళూరు నగరంలో ఓ వివాహిత అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. మృతి చెందిన మహిళను నిహారికగా గుర్తించారు. అయితే నిహారికను భర్తే హత్య చేసి  ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

బెంగళూరు నగరంలో ఓ వివాహిత అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. మృతి చెందిన మహిళను నిహారికగా గుర్తించారు. అయితే నిహారికను భర్తే హత్య చేసి  ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. నిహారిక బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తోంది. అయితే నిహారికకు ఆమె భర్త కార్తీక్‌కు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిహారి భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి.. తన సోదరి ఇంట్లో కొద్దిరోజుల పాటు నివాసం ఉంది. అయితే రెండు రోజుల క్రితం కార్తీక్.. నిహారికను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. 

అయితే రెండు రోజులకే నిహారిక అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నిహారిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అయితే స్కూల్ ఫంక్షన్‌కు వెళ్లే విషయంలో నిహారిక, కార్తీక్ మధ్య గొడవ జరిగిందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. కార్తీక్ తమ కూతురిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. కార్తీక్ తమ కూతురిని వేధించేవాడని చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి నిహారిక తల్లిదండ్రులు కార్తీక్, అతని కుటుంబ సభ్యులపై పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

వివాహేతర సంబంధం నేరం కాకపోతే.. హోటళ్లలో పోలీసుల దాడులు ఎందుకు? అసలు చట్టం ఏం చెబుతోంది?
Supreme Court: బ‌ల‌వంతంగా భాష‌ను రుద్ద‌డ‌మంటే, విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డ‌మే.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు