పెళ్లైన 9 నెలలకే వివాహిత ఆత్మహత్య

Published : Sep 26, 2020, 07:35 AM ISTUpdated : Sep 26, 2020, 07:42 AM IST
పెళ్లైన 9 నెలలకే వివాహిత ఆత్మహత్య

సారాంశం

అత్తింటివారి వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆమె ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టి కనీసం సంవత్సరం కూడా గడవలేదు. పెళ్లైన 9 నెలలో ఆ బంధాన్ని ఆమె మోయలేకపోయింది. వెరసి బలవన్మరణానికి పాల్పడింది. కాగా.. అత్తింటివారి వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆమె ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరు రూరల్‌ జిల్లా ఆనేకల్‌ తాలూకా అత్తిబెలె ఫిర్కా మంచేనహళ్లి గ్రామానికి చెందిన మేఘను మాలూరు తాలూకా మాస్తి ఫిర్కా దొడ్డకల్లహల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప పెద్ద కొడుకు మహేష్‌ చంద్రకు ఇచ్చి 9 నెలల క్రితం వివాహం చేశారు. కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురం.. అనంతరం కట్నం కోసం వేధింపులు మొదలు కావడంతో నెలన్నర క్రితం పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు నచ్చచెప్పి తిరిగి పంపారు. అయితే గురువారం రాత్రి ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది.  భర్త ఇంటివారే తమ కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  భర్త మహేష్‌ చంద్ర,  అతని అక్క భర్త రేవణ్ణలను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..