ఒకే వూరి వాళ్లం... చిన్నప్పటి నుంచి తెలుసు: ఎస్పీబీ మరణంపై ఉప రాష్ట్రపతి దిగ్భ్రాంతి

By Siva KodatiFirst Published Sep 25, 2020, 4:49 PM IST
Highlights

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపు ఐదు దశాబ్ధాల పాటు దేశ ప్రజల్ని తన గాత్రంతో అలరించారు. గత 50 రోజులుగా హాస్పటల్‌లో అనారోగ్యంతో పోరాడుతూ.. కరోనాను సైతం జయించిన ఎస్పీబీని ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపు ఐదు దశాబ్ధాల పాటు దేశ ప్రజల్ని తన గాత్రంతో అలరించారు. గత 50 రోజులుగా హాస్పటల్‌లో అనారోగ్యంతో పోరాడుతూ.. కరోనాను సైతం జయించిన ఎస్పీబీని ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఆయన ఇకలేరనే వార్తలతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. దీంతో ఆయన అభిమానులు, ప్రజలు, పలువురు ప్రముఖులు బాలు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు .. బాలసుబ్రమణ్యంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

 

ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. pic.twitter.com/j6cHkIRESO

— Vice President of India (@VPSecretariat)

 

బాలు తన సొంత గ్రామానికి చెందిన వారైనందున చిన్న నాటి నుంచే తనకు ప్రత్యేక అనుబంధం వుందని తెలిపారు. ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన ఎస్పీబీ అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని వెంకయ్య ట్వీట్ చేశారు.

 

వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

— Vice President of India (@VPSecretariat)

 

వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారని వెంకయ్య నాయుడు కొనియాడారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం.

— Vice President of India (@VPSecretariat)
click me!