
TSPSC paper leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖాలు వేశారు. గ్రూప్ 1 (ప్రిలిమ్స్) పేపర్‌ను ముందుగానే అందుకొన్న విదేశాలు.. వచ్చి పరీక్షలు రాశారనే అభియోగలపై ఈడీ విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారినట్లు ఈడికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఈ వ్యవహరంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. తాజాగా కోర్టు అనుమతితో ప్రవీణ్, రాజశేఖర్‌లను కస్టడీలోకి తీసుకొని విచారించనుంది.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి (Marri Shashidhar Reddy) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జనార్దన్ రెడ్డి 2021 నుంచి టీఎస్పీఎస్సీలో ఛైర్మన్ గా ఉన్నారని తెలిపారు. అప్పటి నుంచి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని చెప్పారు. పేపర్ల లీకేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. 30 లక్షల మందికి ఏ విధంగా నమ్మకం కల్పిస్తారని బీజేపీ నేత ప్రశ్నించారు. ఈ వ్యవహరంపై జ్యూడీషియల్ ఎంక్వయిరీ జరగాలని డిమాండ్ చేయాలని, పూర్తి వివరాలను బయటపెట్టాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో ఔట్ సోర్సింగ్ లో ఉన్న వ్యక్తులను ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని, ఆ బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల పట్ల బీజేపీ పోరాటం చేస్దుందని తెలిపారు.
అలాగే.. బీజేపీ నేత చంద్రవదన్ మాట్లాడుతూ.. మొదట్లోనే పేపర్ లీకేజీ అంశం బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులను కలిశామని, పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు తమ బాధ చెప్పుకున్నారని తెలిపారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. ఆ బోర్డ్ మెంబర్స్ ను అందరినీ మార్చాలని కోరుతున్నారని తెలిపారు. అలాగే.. బీజేపీ నాయకుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… గతంలో నిర్వహించిన పరీక్షల పేపర్లు అన్నీ లీక్ చేశారని మండిపడ్డారు.ప్రతి పేపర్ లీక్ వెనకాల ఐటీ హస్తముందదని ఆరోపించారు. అలాగే, జీహెచ్ఎంసీలో నకిలీ బర్త్,డెత్ సర్టిఫికెట్ల ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై, ఐటీ మంత్రి ఇచ్చిన హామీపై విద్యార్థులకు, ప్రజలకు నమ్మకం లేదని అన్నారు.