
రాయ్‌పూర్:Chhattisgarh రాష్ట్రంలోని Dantewadaజిల్లా kate kalyan పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకొంది. పోలీస్ ఇన్ ఫార్మర్ పేరుతో గ్రామస్తుడిని Maoistకాల్చి చంపారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఛత్తీష్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రంగా ఉంటుంది. policeలకు సమాచారం ఇస్తున్నారనే నెపంతో మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
గతంలో కూడా ఇదే జిల్లాలో ఇదే తరహ ఘటనలు చోటు చేసుకొన్నాయి.2021 నవంబర్ 11న 20 ఏఃళ్ల యువకుడిని మావోయిస్టులు చంపారు. పోలీసులకు సహకరిస్తున్నారనె నెపంతో యువకుడిని దారుణంగా చంపేశారు. ఉమేష్ మర్కం అనే యువకుడు పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడని మావోయిస్టులు ఈ దారుణానికి తెగబడ్డారు.
దంతెవాడ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే తరహలో కూడా నక్సలైట్లు ఇన్ ఫార్మర్ల నెపంతో దారుణాలకు పాల్పడ్డారు. ఛత్తీష్ ఘడ్ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ తరహ ఘటనలు గతంలో చోటు చేసుకొన్నాయి.
2021 డిసెంబర్ 22న ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరువీడు మాజీ సర్పంచ్ రమేష్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. కురుసం రమేష్ 2014 నుండి ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామ సర్నంచ్ గా విజయం సాధించారు. తొలుత రమేష్ కు మావోయిస్టులతో సంబంధాలున్నాయి. అయితే రమేష్ ను పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకొన్నారని మావోలు అనుమానిస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ ఎన్ కౌంటర్ జరిగిందని మావోయిస్టులు ఆరోపించారు. దీంతో రమేష్ ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత అతడిని హత్య చేశారు.
రమేష్ గతంలో మావోయిస్టులకు కొరియర్ గా పనిచేశాడు. అయితే అదే సమయంలో పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడని మావోయిస్టులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ కు రమేష్ బాధ్యుడిగా మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఓ మావోయిస్టు నేతకు విషాహారం పెట్టి అతని మరణానికి కారణమని మావోయిస్టులు ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయమై చత్తీష్‌ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రజా కోర్టు నిర్వహించి రమేష్ చేసిన తప్పులను ఎత్తి చూపి ప్రజా కోర్టులో అతడిని మావోయిస్టులు హత్య చేశారు.
90వ దశకంలో ఉమ్మడి ఏపీ రాస్ట్రంలో మావోయిస్టులు ప్రజా కోర్టులు నిర్వహించేవారు. తప్పు చేసిన వారిని ప్రజా కోర్టులకు వద్దకు తీసుకొచ్చి ప్రజల మధ్యే శిక్షించేవారు. ప్రజల మధ్య కొట్టడం లేదా చిత్రహింసలు పెట్టడంతో చాలా మంది చనిపోయిన ఘటనలు కూడా లేకపోలేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 తర్వాత మావోయిస్టులు క్రమంగా బలహీనపడుతూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల కంటే ఛత్తీష్ ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని పెంచుకొన్నారు.అయితే ఆయా రాష్ట్రాలు మావోయిస్టులను అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు మరణించారు..మరికొందరు పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే.