జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోలు.. బ్రిడ్జి పేల్చివేత, టాప్ కమాండర్‌ను విడిచిపెట్టాలని డిమాండ్

Siva Kodati |  
Published : Jan 23, 2022, 07:46 PM ISTUpdated : Jan 23, 2022, 07:48 PM IST
జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోలు.. బ్రిడ్జి పేల్చివేత, టాప్ కమాండర్‌ను విడిచిపెట్టాలని డిమాండ్

సారాంశం

జార్ఖండ్‌లో (jharkhand) మావోయిస్టులు (maoists) రెచ్చిపోయారు. గిరిధ్ జిల్లాలోని (giridih district ) ఆడుమ్రి పోలీస్ స్టేషన్‌ పరిధిలో బారాగద గ్రామంలోని బరాకర్ నదిపై ఉన్న బ్రిడ్జ్‌ను (bridge blast) కూల్చేశారు. అనంతరం మావోయిస్టులు ఘటనా స్థలంలో కొన్ని కరపత్రాలను వదిలి వెళ్లారు

జార్ఖండ్‌లో (jharkhand) మావోయిస్టులు (maoists) రెచ్చిపోయారు. గిరిధ్ జిల్లాలోని (giridih district ) ఆడుమ్రి పోలీస్ స్టేషన్‌ పరిధిలో బారాగద గ్రామంలోని బరాకర్ నదిపై ఉన్న బ్రిడ్జ్‌ను (bridge blast) కూల్చేశారు. అనంతరం మావోయిస్టులు ఘటనా స్థలంలో కొన్ని కరపత్రాలను వదిలి వెళ్లారు. టాప్ కమాండర్ అరెస్ట్‌కు నిరసనగా మావోలు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు సమాచారం. మావోయిస్టు టాప్ కమాండర్ ప్రశాంత్ బోస్ (prashant bose) , అతని భార్య శీల మరాండీని (shila marandi)  గతేడాది నవంబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా మావోయిస్టులు జనవరి 21 నుంచి ప్రతిఘటనా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే బ్రిడ్జిని పేల్చేశారు.

ఒక్కసారిగా భారీ శబ్ధంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రశాంత్ బోస్, ఆయన భార్య షీలా మరాండిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు పోస్టర్లను ఆ స్థలంలో పడేశారు. 

మావోయిస్టులు పేల్చేసిన వంతెనను ప్రభుత్వం 2019లో నిర్మించింది. ఇటీవలే దానిని ప్రారంభించారు. అంతకుముందు రెండు సెల్ టవర్లను కూడా మావోయిస్టులు ధ్వంసం చేశారు. దాంతో ఒక గంట పాటు ఆయా టెలికాం సంస్థల సేవలకు అంతరాయం ఏర్పడింది. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు సీరియస్ అయ్యారు. ఆ వెంటనే మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌‌ను మరింత ముమ్మరం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?