దర్భాలోని భద్రతా బలగాల క్యాంప్‌పై మావోయిస్టుల దాడి..

Published : Apr 18, 2022, 09:24 AM IST
దర్భాలోని భద్రతా బలగాల క్యాంప్‌పై మావోయిస్టుల దాడి..

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో (Bijapur District) మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్భాలోని భద్రతా బలగాల క్యాంప్‌పై మావోయిస్టులు దాడి జరిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో (Bijapur District) మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్భాలోని భద్రతా బలగాల క్యాంప్‌పై మావోయిస్టులు దాడి జరిపారు. ఈ దాడిలో నలుగురు సైనికులు గాయపడ్డారు. వివరాలు.. దర్భాలోని భద్రతా  బలగాల క్యాంపుపై మావోయిస్టుల దాడి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో  అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లతో (Under barrel Grenade Launchers) క్యాంప్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో నలుగురు సైనికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీ పి సుందర్‌రాజ్ ధ్రువీకరించారు.

దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ధీటుగా స్పందించాయి. మావోయిస్టులపై ఎదురుదాడికి దిగాయి. దాదాపు 30 నిమిషాల పాటు మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం వెనక్కి తగ్గిన మావోయిస్టులు.. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. ఇక, మావోయిస్టుల దాడిలో గాయపడిన 4గురిలో ఇద్దరికి బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం