కరోనా అనుమానంతో క్వారంటైన్ లో కుమార్తె .. తండ్రి చనిపోతే...

By telugu news teamFirst Published Jun 5, 2020, 11:14 AM IST
Highlights

ఆమె క్వారంటైన్ లో ఉండగా... అంజలి తండ్రి ఆరోగ్యం క్షీణించినట్లు గుర్తించారు. మరి కొద్ది నిమిషాల్లో తండ్రి చనిపోతాడనగా.. ఆమె తండ్రిని చూడాలంటూ అధికారులను వేడుకుంది. కాగా.. అప్పటికే అతను చనిపోయాడు. శవపేటికలో సైతం అతని మృతదేహాన్ని ఉంచారు.

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. దేశంలోనూ దీని ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ కరోనా కారణంగా కనీసం బంధువులు చనిపోయినా.. సొంతవారు దూరమైనా అంత్యక్రియలకు కూడా  అనుమతి దొరకడం లేదు. కాగా..  ఓ వ్యక్తి చనిపోగా.. అతనిని చూడటానికి కుమార్తెకు కేవలం మూడు నిమిషాల సమయమే దొరికింది.ఈ సంఘటన మణిపూర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గత నెల 25న అంజలి(25) అనే యువతి వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలులో చైన్నై నుంచి మణిపూర్ చేరుకుంది. కాగా... ఆమెతో ప్రయాణించిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రావడంతో ఆమెను కూడా క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

కాగా.. ఆమె క్వారంటైన్ లో ఉండగా... అంజలి తండ్రి ఆరోగ్యం క్షీణించినట్లు గుర్తించారు. మరి కొద్ది నిమిషాల్లో తండ్రి చనిపోతాడనగా.. ఆమె తండ్రిని చూడాలంటూ అధికారులను వేడుకుంది. కాగా.. అప్పటికే అతను చనిపోయాడు. శవపేటికలో సైతం అతని మృతదేహాన్ని ఉంచారు.

కాగా.. అధికారుల అనుమతితో ఆమెకు పీపీఈ కిట్ ధరించి... తండ్రిని చూసేందుకు అక్కడకు వచ్చింది. బంధువులు, కుటుంబసభ్యులంతా దూరంగా నిలబడి ఉండగా.. శవ పేటిలో ఉన్న తండ్రిని చూసేందుకు ఆమెకు అధికారులు కేవలం మూడు నిమిషాల సమయం ఇవ్వడం గమనార్హం.

ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి అధికారులు తీసుకువెళ్లారు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత యువతి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు.

click me!