బంధువుల పెళ్లికి వెళ్లి.. కోటీశ్వరుడయ్యాడు..!

Published : Feb 10, 2021, 07:55 AM ISTUpdated : Feb 10, 2021, 07:58 AM IST
బంధువుల పెళ్లికి వెళ్లి.. కోటీశ్వరుడయ్యాడు..!

సారాంశం

శుభకార్యం చూసుకుని స్నేహితుడు దేవదాసు ప్రభాకర్‌ ఇంటికి వెళ్లాడు. దేవదాసు దుకాణంలో  కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్నాడు బలరామ్‌.

ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో తలుపుకొడుతుందని చెబుతూ ఉంటారు. ఇలానే ఓ యువకుడికి అనుకోని అదృష్టం తలుపుతట్టింది. బంధువల పెళ్లికి పక్క రాష్ట్రానికి వెళ్లి.. మళ్లీ కోటీశ్వరుడయ్యి.. సొంత ఊరికి చేరుకున్నాడు. కర్ణాటక యువకుడికి కేరళలో కోటి రూపాయల భారీ లాటరీ లభించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన యువకునికి కేరళలో రూ.కోటి లాటరీ తగిలింది. శోహాన్‌ బలరామ్‌ అనే యువకుడు ఈ నెల 5వ తేదీన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యం చూసుకుని స్నేహితుడు దేవదాసు ప్రభాకర్‌ ఇంటికి వెళ్లాడు. దేవదాసు దుకాణంలో  కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్నాడు బలరామ్‌.

తరువాత కుటుంబంతో కలిసి కారులో మండ్యకు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో శోహాన్‌ మొబైల్‌కు ఫోన్‌ వచ్చింది. నువ్వు కొన్న టికెట్‌కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని మిత్రుడు చెప్పగా ఏదో తమాషా చేస్తున్నాడు అని నవ్వుకున్నాడు. కానీ వెంటనే టికెట్‌ తీసుకుని తిరిగి రా అని ఒత్తిడి చేయడంతో వెనుదిరిగాడు. డ్రాలో వచ్చిన నంబర్‌ చూసుకుంటే నిజంగానే లాటరీ తగిలింది. సుమారు 48 లక్షల మంది లాటరీ టికెట్‌ కొంటే అందులో ఐదుమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుందని స్థానికులు తెలిపారు. బలరామ్‌ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. లాటరీ డబ్బుతో తమకున్న రైస్‌మిల్‌ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌