విమానంలో కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన యువకుడు.. వీడియో వైరల్...!

Published : Jan 12, 2023, 02:32 PM IST
విమానంలో కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన యువకుడు.. వీడియో వైరల్...!

సారాంశం

ఆమెతో పాటే... ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అదే విమానంలో వస్తుండటం గమనార్హం. అయితే... వారు ప్రయాణిస్తున్న విమానంలోనే అతను ఆమెకు ప్రపోజ్ చేశాడు.. విమాన సిబ్బంది సహాయంతో అతను ప్రపోజ్ చేసిన విధానం ఎంతగానో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఓ యువకుడు విమానంలో తనకు కాబోయే భార్యకు చాలా రొమాంటిక్ గా ప్రపోజ్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానంలో ఆ యువకుడు ప్రపోజ్ చేసిన వీడియో... ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు... ఈ వీడియోకి ఫిదా అయిపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

ఈ నెల 2వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ లండన్ నుంచి హైదరాబాద్ కి వస్తోంది.  కాగా... ఆమెతో పాటే... ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అదే విమానంలో వస్తుండటం గమనార్హం. అయితే... వారు ప్రయాణిస్తున్న విమానంలోనే అతను ఆమెకు ప్రపోజ్ చేశాడు.. విమాన సిబ్బంది సహాయంతో అతను ప్రపోజ్ చేసిన విధానం ఎంతగానో అందరినీ ఆకట్టుకుంటోంది.

విమానం గాల్లో ఉండగా ఒక చార్ట్‌ పట్టుకుని మెల్లగా ప్రియురాలు కూర్చొన్న సీటు వద్దకు అతడు వచ్చాడు. ‘నేను ఎప్పటికీ నీతో నడవాలనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో కలిసి నడుస్తావా?’ రాసి ఉన్న ఆ చార్ట్‌ను ఆమెకు చూపించాడు. మొదట అది చూసి షాక్ అయిన ఆమె... వెంటనే అతనితో పాటు.. అడుగులు వేస్తూ ముందుకు వచ్చింది.

 

ఆ తర్వాత... వెంటనే మోకాలి పై కూర్చొని రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు. ఆమె ఆ ఉంగరం అందుకొని.. ఆ తర్వాత వెంటనే అతనిని హత్తుకుంది. వారి జంటను చూసి... విమానంలోని వారంతా చప్పట్లు కొట్టి.. అభినందించారు. దీనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా... వైరల్ గా మారింది.
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !