అల్లుడి ఘాతుకం.. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా భార్య, అత్త,మరదల్ని హతమార్చాడు...

Published : Sep 30, 2021, 12:15 PM IST
అల్లుడి ఘాతుకం.. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా భార్య, అత్త,మరదల్ని హతమార్చాడు...

సారాంశం

6 నెలల క్రితం హైదరాబాద్ కు చెందిన సాయి అనే యువకుడితో పెద్ద కూతురు వైష్ణవి వివాహం జరిపించారు. సాయి హైదరాబాద్లో వడ్డీ వ్యాపారి.  పెళ్లి అయిన నాటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు.  దీంతో ఇటీవల వైష్ణవి పుట్టింటికి వచ్చింది. 

కర్ణాటక (karnataka)లోని రాయచూరు లో దారుణం చోటుచేసుకుంది. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అల్లుడు (son-in-law) చేతిలో అత్తతో పాటు, భార్యా, మరదలూ హత్య(Triple murder)కు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తాలూకాలోని యరమరాస్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యరమరాస్‌లో ఇంజనీరింగ్ కళాశాల వద్ద నివాసము ఉంటున్న పారిశుద్ధ్య కార్మికురాలు సంతోషి (45) కి  వైష్ణవి (25), హారతి (16) అని ఇద్దరు కూతుళ్ళు.

6 నెలల క్రితం హైదరాబాద్ కు చెందిన సాయి అనే యువకుడితో పెద్ద కూతురు వైష్ణవి వివాహం జరిపించారు. సాయి హైదరాబాద్లో వడ్డీ వ్యాపారి.  పెళ్లి అయిన నాటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు.  దీంతో ఇటీవల వైష్ణవి పుట్టింటికి వచ్చింది.  పుట్టింటికి వచ్చిన భార్య  భార్య కోసం మంగళవారం రాత్రి సాయి అత్తవారింటికి వచ్చాడు. తనతో పాటు హైదరాబాద్ కు రావాలని భార్యను ఒత్తిడి చేయడంతో ఆమె ససేమిరా ఒప్పుకోలేదు.

కరోనాతో భర్త మృతి.. తట్టుకోలేక ముగ్గురు కూతుళ్లతో కలిసి, నదిలో దూకిన తల్లి.. చివరకు..

 ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన సాయి భార్యను, అడ్డు వచ్చిన అత్త సంతోషిని,  మరదలు  హారతిని  కత్తితో పొడిచి పరారయ్యాడు.  తీవ్రగాయాలతో బాధితులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ నిద్ర లో  ఉన్నందున  జరిగిన ఘటన గురించి ఎవరికీ  తెలియలేదు.  

బుధవారం ఉదయం సంతోషి బంధువులు ఏదో పని పడి ఇంటికి రాగా  రక్తపు మడుగులో ముగ్గురు మృతదేహాలు కనిపించాయి. అది చూసి షాక్ కి గురైన వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  ఎస్పీ శ్రీహరి బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.రాయచోటి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. అతని కోసం హైదరాబాద్కు పోలీసు బృందాలు వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్