కేరళలో మరో దారుణం: బాలికను సజీవదహనం చేసి యువకుడి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Oct 10, 2019, 03:43 PM IST
కేరళలో మరో దారుణం: బాలికను సజీవదహనం చేసి యువకుడి ఆత్మహత్య

సారాంశం

కొచ్చి నగరంలోని కక్కానాడులో ఉంటున్న 17 ఏళ్ల బాధితురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  దీనిని గమనించిన బాలిక తండ్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటీక లాభం లేకుండా పోయింది.

ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను కోడలే అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన మరచిపోకముందే కేరళలో మరో ఘటన జరిగింది. ఓ బాలికను సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

కొచ్చి నగరంలోని కక్కానాడులో ఉంటున్న 17 ఏళ్ల బాధితురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  దీనిని గమనించిన బాలిక తండ్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటీక లాభం లేకుండా పోయింది.

ఈ ఘటనలో తండ్రికి సైతం గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పర్వూర్‌కు చెందిన మిథున్ అనే యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

అయితే బాలికను సజీవ దహనం చేసిన వెంటనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సంబంధం, ఈ ఘటనకు దారితీసిన వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?