రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. 28 రోజుల్లోనే వలసకార్మికుడికి మరణశిక్ష..

By SumaBala BukkaFirst Published Dec 8, 2021, 8:07 AM IST
Highlights

నవంబర్ 4 రాత్రి అతడు ఈ నేరానికి పాల్పడగా... కేవలం నెల రోజుల వ్యవధిలోనే నిందితుడికి శిక్ష విధించడం గమనార్హం. బాలిక పై హత్యాచారానికి పాల్పడిన యాదవ్ ను అదే నెల 8న పోలీసులు అరెస్టు చేశారు.  ఈ కేసులో ఏడు రోజుల్లోనే 246 పేజీల ఛార్జీషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

సూరత్ : రెండున్నర ఏళ్ల బాలికపై molestation చేసి murder చేసిన 37 ఏళ్ల వలస కార్మికుడికి గుజరాత్లోని సూరత్లో POCSO Court మరణశిక్ష విధించింది.  సూరత్ లోని పందేసర ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారిపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీహార్ కి చెందిన గుడ్డు యాదవ్ అనే కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

నవంబర్ 4 రాత్రి అతడు ఈ నేరానికి పాల్పడగా... కేవలం నెల రోజుల వ్యవధిలోనే నిందితుడికి శిక్ష విధించడం గమనార్హం. బాలిక పై హత్యాచారానికి పాల్పడిన యాదవ్ ను అదే నెల 8న పోలీసులు arrest చేశారు.  ఈ కేసులో ఏడు రోజుల్లోనే 246 పేజీల ఛార్జీషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

ఈ కేసులో 43 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం…  కేవలం 28 రోజుల్లోనే తీర్పును వెలువరించింది. సోమవారం నిందితుడు గుడ్డు యాదవ్ ను దోషిగా తేల్చిన కోర్టు మంగళవారం మరణశిక్ష ఖరారు చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల Compensation ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

పరిచయస్తుడని బండెక్కితే.. మద్యం తాగించి, అడ్డాకూలీపై హత్యాచారం...

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో పదిహేడు మంది అమ్మాయిల మీద దారుణానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ప్రాక్టికల్స్ పరీక్షల పేరిట రాత్రి వేళ పదిహేడు మంది పదవ తరగతి చదువుతున్న బాలికలను పాఠశాలకు పిలిచి, వారికి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో  వెలుగుచూసింది. వివరాల్లోకి వెడితే.. 

నవంబర్ 17వ తేదీ రాత్రి Muzaffarnagar లో పదవ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు CBSE Practical Examసాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు. ఉపాధ్యాయుడిని అమాయకంగా నమ్మిన విద్యార్థులు రాత్రివేళ స్కూల్ కు వెళ్లారు. 

అక్కడ ఆ కీచకుడు ఆ బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టాడు. ఆ తరువాత మత్తులోకి జారుకున్న అమ్మాయిలపై ఉపాధ్యాయుడు Sexually harassment చేశాడు. మత్తులోకి జారుకున్న బాలికలు మరుసటి రోజు తేరుకుని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే స్పృహలోకి వచ్చాక తమకు జరిగింది తెలిసినా..  ‘ఏం జరిగిందో ఎవరికీ చెప్పవద్దని.. చెబితే వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని’ నిందితుడైన ఉపాధ్యాయుడు బాలికలను threatening చేశాడు.

ఈ బాలికలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. దీంతో ఉపాధ్యాయుడిని ఎదురించే ధైర్యం లేక మౌనంగా భరించారు. అయితే ఇందులో ఇద్దరు బాలికల తల్లిదండ్రులు మాత్రం తమ కూతుర్లకు జరిగిన అన్యాయ్యాని ఊరుకోదలుచుకోలేదు. వీరిద్దరూ పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్  ఉత్పాల్ ను సంప్రదించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

ఎమ్మెల్యే చొరవతో బాధిత బాలికలు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  అభిషేక్ యాదవ్ ను సంప్రదించారు.  ఎస్పీ యాదవ్  జరిపిన దర్యాప్తులో ఆరోపణలు నిజమేనని తేలింది. ఈ కేసులో ఇద్దరు నిందితులైన ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేసినా, వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ పై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించారు. 

click me!