మైనర్ పై లైంగికదాడులు.. కేరళ వాసికి 142 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు

By Mahesh KFirst Published Oct 1, 2022, 6:26 PM IST
Highlights

కేరళలో ఓ మైనర్ బాలిక పై దుండగుడు రెండేళ్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసును పోక్సో కోర్టు విచారించింది. దోషికి 142 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, మొత్తం రూ. 5 లక్షల జరిమానా విధించింది.

తిరువనంతపురం: కేరళలో మైనర్ పై లైంగికదాడికి పాల్పడ్డ ఓ దోషికి పోక్సో కోర్టు 142 ఏళ్ల జైలు శిక్ష పడింది. రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా చెల్లించకుంటే మరో మూడేళ్ల జైలు శిక్ష అదనంగా అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. పదేళ్ల బాలికను రెండేళ్లుగా లైంగిక వేధిస్తున్న దోషికి పోక్సో కోర్టు ఈ శిక్ష విదించింది.

ఆనందన్ పీ ఆర్ అలియాస్ బాబు అనే వ్యక్తి పై తిరువల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పదేళ్ల బాలికను రేప్ చేసిన ఆరోపణలతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 2019 నుంచి 2021 మధ్య కాలంలో అత్యంత క్రూరంగా ఆ మైనర్ బాలికపై రేప్ చేశాడు. బాబు ఆ బాధితురాలికి బంధువే. బాలిక తల్లిదండ్రులతో కలిసే అదే నివాసంలో ఉన్నాడు.

సాక్షుల వాంగ్మూలాలు, మెడికల్ రికార్డులు బాబు దోషి అని బలంగా చెబుతున్నాయని, పోక్సో ప్రాసిక్యూటర్‌గా అడ్వకేట్ జాసన్ మాథ్యూస్ ఉన్నాడని పథానంతిట్ట పోలీసులు తెలిపారు. తిరువల్ల పోలీసు ఇన్‌స్పెక్టర్ హరిలాల్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 

ఈ కేసు విచారిస్తూ మొత్తం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్షను పోక్సో కోర్టు విధించింది. అలాగే, మొత్తం రూ. 5 లక్షల జరిమానా విధించినట్టు జిల్లా పోలీసులు తెలిపారు.

click me!