రెండున్నరేళ్ల చిన్నారిపై తండ్రి అఘాయిత్యం.. క్షమార్హం కాదంటూ.. జీవితఖైదు విధించిన కోర్టు..

Published : Feb 19, 2022, 10:53 AM IST
రెండున్నరేళ్ల చిన్నారిపై తండ్రి అఘాయిత్యం.. క్షమార్హం కాదంటూ.. జీవితఖైదు విధించిన కోర్టు..

సారాంశం

పసిపాప అని కూడా చూడకుండా.. రెండున్నరేళ్ల కన్న కూతురిపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడో కిరాతకుడు. ఆ మృగానికి క్షమాభిక్ష పెట్టే ప్రశ్నే లేదంటూ.. జీవితఖైదు విధించింది కోర్టు.. 

తిరువనంతపురం : రెండున్నరేళ్ల సొంత కూతురిని sexually abuses చేసిన ఓ వ్యక్తికి Thiruvananthapuramలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు తో పాటు.. రూ.50,000 జరిమానా విధించింది. ఈ దారుణ ఘటన ఫిబ్రవరి 2018లో జరిగింది. ఈ కేసులో ఇప్పుడు న్యాయస్థానం తీర్పునిచ్చింది.

కేసు వివరాల్లోకి వెడితే.. నిందితుడు తన భార్య, బిడ్డలు, అత్తమామలతో కలిసి ఉండేవాడు. రాత్రివేళ భార్య, కూతురు, నిందితుడు ఒకే దగ్గర పడుకునేవారు. కాగా చిన్నారి.. Urination సమయంలో తరచుగా ఏడుస్తూ.. నొప్పితో బాధపడుతుండటం తల్లి గమనించింది. దీంతో ఆమెకు అనుమానం పెరిగింది. చిన్నారిని పరీక్షించగా.. చిన్నారి Private partsపై గాయాలు ఉన్నట్లు తేలింది. 

కాగా, సదరు కీచక తండ్రి ఆ బిడ్డ తనకు పుట్టలేదంటూ.. భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. అంతేకాదు తన బిడ్డో, కాదో తేల్చుకోవడానికి అతను DNA పరీక్ష చేయించాలంటూ పట్టుబట్టాడు. దీంతో ఆమెకు భర్త మీద అనుమానం వచ్చింది. ఇది అతని దుర్మార్గమైన చర్యే అయి ఉంటుందనుకుంది. ఓ రోజు రాత్రి తన భర్త బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడడం చూసి షాక్‌కు గురైంది. 

వెంటనే ఆమె అరుపులు, కేకలు వేస్తూ.. అందర్నీ లేపడానికి ప్రయత్నించింది. దీంతో ఆ భర్త చంపేస్తానని, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో పదే పదే లైంగిక వేధింపులకు గురికావడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు.

చిన్నారిని పరీక్షించిన వైద్యుడు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో  రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తీర్పును ప్రకటించేటప్పుడు, నిందితుడు తన సొంత బిడ్డపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. కాబట్టి అతనికి ఎలాంటి క్షమకూ అర్హుడు కాదని కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి 13 మంది సాక్షులను విచారించిన కోర్టు 17 డాక్యుమెంట్లను విచారించింది. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్‌ఎస్‌ విజయ్‌మోహన్‌ హాజరయ్యారు.

ఇదిలా ఉండగా, తన lover 2 ఏళ్ల daughterను ఏడు నెలలుగా Tortureకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆంధ్రప్రదేశ్ లోని.. విజయనగరం కొత్తకోట సమీపంలో ఉన్న 26 ఏళ్ల Married womanను భర్త వదిలేశాడు. ఆమెకు రెండేళ్ల చిన్నారి ఉంది. కూలి పనులు చేసుకుని బతుకుతుంది. ఈ క్రమంలో నెల్లిమర్లలో ఓ శుభకార్యంలో ఆమెకు ఓప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చిన్నా (29)తో పరిచయం ఏర్పడింది. అది Symbiosisకి దారితీసింది. ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

ఏడు నెలలుగా బాలికను కొట్టడం, రక్కడం వంటి వికృత చేతులకు చిన్నా పాల్పడుతున్నా ఆమె అడ్డు చెప్పలేదు. కానీ, బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేనప్పుడు పాప బుగ్గలు, కాళ్లు, చేతులను చిన్నా కొరికేసాడు. ఆమె ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుంది. చుట్టుపక్కలవారు ఏమైంది.. అని అడిగితే విషయాన్ని దాటవేసింది. అంగన్వాడి సిబ్బందికి విషయం తెలియడంతో స్థానిక మహిళా సంరక్షణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి ఫిర్యాదు మేరకు చిన్నాను రిమాండ్ కు తరలించారు దిశ డీఎస్పీ టి. త్రినాథ్ తెలిపారు. బాలికను వైద్య చికిత్సలకు ఆసుపత్రికి తరలించామని, తల్లికి వ్యక్తిత్వ, మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్ చేయిస్తామని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌