సైకిల్ ఎక్కడంలో వింతేముంది అనే సందేహం మీకు కలగొచ్చు. అందులో వింతేమీ లేదు కానీ.... ఆ సైకిల్ పై ఎనిమిది మంది పిల్లలను ఎక్కించుకోవడం అక్కడ విశేషం.
ఇంటర్నెట్ ప్రస్తుత కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో... ప్రపంచంలో ఏ మూలలో ఏం జరిగినా అందరికీ తెలిసిపోతోంది. తాజాగా... సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఓ వ్యక్తి సైకిల్ ఎక్కి కనిపిస్తున్నాడు. సైకిల్ ఎక్కడంలో వింతేముంది అనే సందేహం మీకు కలగొచ్చు. అందులో వింతేమీ లేదు కానీ.... ఆ సైకిల్ పై ఎనిమిది మంది పిల్లలను ఎక్కించుకోవడం అక్కడ విశేషం.
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఒక సైకిల్ ఇద్దరు కంటే ఎక్కువ ఎక్కలేరు. అలాంటిది ఏకంగా ఎనిమిది మంది పిల్లలను ఎక్కించుకోవడం గమనార్హం. దీంతో... దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోని జైకీ యాదవ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
undefined
आज दुनिया की आबादी 8 अरब हो गई, इस उपलब्धि को हासिल करने में ऐसे इंसानों को बहुत बड़ा योगदान रहा है👇 pic.twitter.com/Fiq62o0OiK
— Jaiky Yadav (@JaikyYadav16)దీనికి ఇప్పటి వరకు 150వేల వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ వీడియోకి నెటిజన్ల రియాక్షన్ అయితే మామూలుగా లేదు. పిల్లలు సైకిల్ మీద ఎక్కిన విదానం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ముందు, వెనక... ఒకరి ముందు మరొకరు , సైకిల్ తొక్కుతున్న వ్యక్తి భుజాలపై కూడా ఎక్కడం గమనార్హం. ఇంత మంది అతని పిల్లలేనా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.... ప్రపంచ జనాభా 800 బిలియన్లకు చేరుకున్నారు అంటే... ఇదే కారణం కావచ్చు అంటూ మరికొందరు కామెంట్ చేయడం విశేషం. మీరు కూడా ఈ వీడియో పై ఓ కన్నేయండి.