
భోపాల్ : madhya pradesh రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ పండ్ల వ్యాపారి ఇంటి నుంచి evil spiritsను తరిమికొడతాను అని చెప్పి ఓ మైనర్ బాలికపై ఆరు నెలల పాటు molestation చేశాడు. భోపాల్ లోని Habib ganjకు చెందిన 30 ఏళ్ల పండ్ల విక్రయదారుడు నిహాల్ బేగ్ ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు బాలిక ఇంటికి వచ్చినప్పుడు ఆమె కుటుంబ సభ్యులను నమ్మించి అదృష్టాన్ని తెస్తానని చెప్పి బాలికపై మొదట అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ల వ్యాపారవేత్త. ఆమె తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.
కరోనా లాక్ డౌన్ సమయంలో బాలిక తండ్రికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ‘వారి దురదృష్టం వెనక ఒక దుష్టాత్మ ఉంది. దానిని పారదోల వలసిన అవసరం ఉంది.. దీని కోసం ప్రత్యేక ప్రార్థనలు అవసరం’ అని నిహాల్ బేగ్ బాలిక తల్లిదండ్రులను ఒప్పించాడు. నిందితుడు వారానికి రెండుసార్లు బాధితురాలి ఇంటికి వచ్చేవాడు. చారాల సమయంలో ప్రత్యేక గదుల్లో ఉండాలని కుటుంబ సభ్యులందరినీ నమ్మించాడు. మొదటిసారి నిందితుడు బాలికను భయపెట్టాడు. బాలిక తనతో శారీరకంగా కలవడానికి అనుమతించకపోతే ఆత్మ ఆమె తల్లిదండ్రులను చంపేస్తుంది అని చెప్పాడు.
ఆ తరువాత రెగ్యులర్ గా ప్రతీవారం రెండుసార్లు బాలిక మీద అత్యాచారంం చేస్తూ వస్తున్నాడు. దీంతో బాగా కుంగిపోయిన బాలిక.. చివరికి ధైర్యం చేసి తల్లిదండ్రులకు జరిగిన ఘోరం గురించి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితుడు అరెస్ట్ చేసి అతడిపై ఫోక్సో చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 1న మైనర్ రేప్ విషయంలో కోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. జూబ్లీహిల్స్ లో ఓ బాలిక బంధువు చేతిలో మోసపోయింది. ఆ బంధువు చేసిన మోసం కారణంగా వచ్చిన Unwanted pregnancyని తొలగించుకోవడానికి ఆ బాలికకు High Court అనుమతి ఇచ్చింది. బాలిక (15)ను ఆమె బంధువు.. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటి నుంచి బయటకు తీసుకు వెళ్లి... బలవంతంగా తన లైంగిక వాంఛ తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ అవాంఛిత గర్భాన్ని తొలగించాలని కుటుంబసభ్యులు Nilofar Hospital ఆశ్రయించారు. అందుకు వారు నిరాకరించారు. అబార్షన్ చేయాలంటే చట్టప్రకారం అనుమతులు అవసరం.. అని చెప్పడంతో బాలిక తరఫున ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది.
15 సంవత్సరాల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆమె ఇష్టపూర్వకంగానే బంధువులో వెళ్ళినా, లైంగికంగా కలిసిన.. molestation పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. గర్భం కారణంగా మైనర్ అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని… శారీరకంగా, మానసికంగానూ ప్రభావం ఉందని పేర్కొంది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంచిత గర్భాన్ని తొలగించుకోవచ్చు అని తెలిపింది. అయితే దీనికి ముందు బాలికతో, ఆమె తల్లితో సూపరింటెండెంట్ విడివిడిగా మాట్లాడాలని ఆదేశించింది. అబార్షన్ వల్ల ఎదురయ్యే అన్ని పరిణామాలను వారిద్దరికీ వివరించాలని, ఇద్దరూ అంగీకరిస్తే జాప్యం లేకుండా గర్భవిచ్ఛిత్తి చేయాలని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులకు హైకోర్టు ఆదేశించింది.