దారుణం : మైనర్ బాలికతో సహా.. ఒకే కుటుంబంలో నలుగురిపై అత్యాచారం.. !

Published : Jan 25, 2021, 10:36 AM IST
దారుణం : మైనర్ బాలికతో సహా.. ఒకే కుటుంబంలో నలుగురిపై అత్యాచారం.. !

సారాంశం

దేశంలో రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళల మీద అమానుషాలకు అంతులేకుండా పోతోంది. ఒకే కుటుంబంలోని నలుగురిమీద ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది.

దేశంలో రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళల మీద అమానుషాలకు అంతులేకుండా పోతోంది. ఒకే కుటుంబంలోని నలుగురిమీద ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది.

ఒకే కుటుంబంలోని మైనర్ బాలిక సహా నలుగురిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో వెలుగుచూసింది. దౌసా జిల్లాకు చెందిన విష్ణు గుర్జర్ అనే వ్యక్తి దాబా నడుపుతున్నాడు. తన దాబాకు దగ్గర్లో ఉన్న ఓ కుటుంబంపై అతను కన్నేశాడు. 

ఈ కుటుంబానికి చెందిన మహిళను బెదిరించి ఆమెపై ఏడాది కాలంగా అత్యాచారం చేశాడు. ఆమెతో వదలలేదు, ఆమె ఇద్దరు చెల్లెళ్లు, మైనర్ అయిన ఆమె కూతురి మీద కూడా అత్యాచారానికి ఒడిగట్టాడు దుర్మార్గుడు. 

దీంతో తట్టుకోలేక ఆ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు విష్ణు తన చెల్లెళ్లతోపాటు కుమార్తెపై కూడా అత్యాచారం చేశాడని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు విష్ణు గుర్జర్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu