క్రైం టీవీ షో చూసి.. బాలుడి కిడ్నాప్...!

By telugu news teamFirst Published Jan 25, 2021, 9:27 AM IST
Highlights

 నేరాలు ఎలా జరుగుతున్నాయనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్రైం టీవీషోలు చేస్తున్నారు. దానిని చూసి.. నేరం ఎలా చేయాలో ఇద్దరు వ్యక్తులు నేర్చుకున్నారు. 

టీవీ ల ప్రభావం ప్రజలపై బాగా పడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. టీవీలు చూసి మంచి నేర్చుకుంటారో లేదో తెలీదు కానీ.. చెడు మాత్రం చక్కగా నేర్చుకుంటారు. ఈ మధ్యకాలంలో నేరాలు ఎలా జరుగుతున్నాయనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్రైం టీవీషోలు చేస్తున్నారు. దానిని చూసి.. నేరం ఎలా చేయాలో ఇద్దరు వ్యక్తులు నేర్చుకున్నారు. దాని ప్రకారమే.. ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ షంఘటన ముంబయిలో చోటుచేసుకోగా..  ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయి కి చెందిన ఇద్దరు యువకులు ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేశారు. టీవీ షోలో చూసి దానిలో మాదిరిగానే.. బాలుడిని కిడ్నాప్ చేయడం గమనార్హం. అనంతరం బాలుడి తండ్రికి రూ.10లక్షలు కావాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. పోలీసులు చాలా తెలివిగా వ్యవహరించి.. వారి మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి దొంగలను పట్టుకోవడం గమనార్హం.

శేఖర్ విశ్వకర్మ(35), దివ్యాన్షు విశ్వఖర్మ(21).. రాత్రి 7గంటల సమయంలో.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని బెదిరించి వాళ్ల తండ్రి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అనంతరం వాళ్ల నాన్నకి ఫోన్ చేసి మీ అబ్బాయి మీకు క్షేమంగా కావాలంటే రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బాలుడిని కిడ్నాప్ చేసిన మూడు గంటల్లోనే నిందితులు దొరికేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!