షాక్: ప్రేయసి కోసం నడిరోడ్డుపై ప్రియుడు ఏం చేశాడంటే?

Published : Aug 19, 2018, 06:45 AM ISTUpdated : Sep 09, 2018, 01:33 PM IST
షాక్: ప్రేయసి కోసం నడిరోడ్డుపై ప్రియుడు ఏం చేశాడంటే?

సారాంశం

మహారాష్ట్రలో ఓ ప్రియుడు తన ప్రేయసికి తనపై ఉన్న కోపాన్ని పోగోట్టేందుకు చేసిన పనికి పోలీసులతో పాటు స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయితే ఈ పని చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

పూణె: మహారాష్ట్రలో ఓ ప్రియుడు తన ప్రేయసికి తనపై ఉన్న కోపాన్ని పోగోట్టేందుకు చేసిన పనికి పోలీసులతో పాటు స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయితే ఈ పని చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలోని పింప్రి చించ్ వాడ్ ప్రాంతానికి చెందిన నీలేశ్ ఖేడేకర్ అనే 25 సంవత్సరాల కుర్రాడు తన ప్రేయసికి క్షమాపణలు చెబుతూ నగరంలోని రోడ్లపై (ఆ అమ్మాయి పేరు రాసి  ఐయామ్ సారీ అంటూ 300లకు పైగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీంతో ఇది చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన స్థానికులు షాక్ కు గురయ్యారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసింది. ప్రజల ఆస్తిని నాశనం చేసినందుకు, అనుమతి లేకుండా హోర్డింగ్ లు ఏర్పాటు చేసినందుకు నీలేష్ పై పోలీసులు కేసులు  పెట్టారు.

ముంబై నుండి నీలేష్ ప్రియురాలు తన స్వగ్రామానికి వస్తోంది.ఈ విషయాన్ని తెలుసుకొన్న ప్రియుడు రోడ్లపై ఈ రకంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేశాడు.గురువారం రాత్రి పూట స్నేహితుడితో కలిసి నీలేష్ ఈ పని చేశాడు. అయితే అనుమతి లేకుండా హోర్డింగ్ లు ఏర్పాటు చేసిన నీలేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

DMart : ఉద్యోగులకు డీమార్ట్ స్పెషల్ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బులు సేవ్..!
UPSC Interview Questions : మొబైల్, సెల్ ఫోన్ కి తేడా ఏమిటి..?