
న్యూఢిల్లీ: డెలివరీ సర్వీసుల్లో అప్పుడప్పుడు ఒకరి ఆర్డర్ మరొకరికి చేరడం జరుగుతాయి. ఇది కామన్. కానీ, మరీ షాక్‌కు గురయ్యేంతగా ఏమీ ఉండవు. ఆర్డర్ చేసింది ఒక ఫుడ్ ఐటమ్ అయితే..మనకు మరో రకమైన ఫుడ్ఐటమ్ రావొచ్చు. కానీ, మరీ ఈ వ్యక్తికి వచ్చినంత తేడాగా ఏమీ ఉండకపోవచ్చు. పెరియాసామి అనే ట్విట్టర్ యూజర్ తాను పెట్టిన ఆర్డర్ వచ్చిన డెలివరీ గురించి పోస్టు చేశాడు. ఆ పోస్టు వైరల్ అవుతున్నది. నెటిజన్లు సరదా కామెంట్లతో ఈ పోస్టు వైరల్ అవుతున్నది.
పెరియాసామి అనే వ్యక్తి పిల్లలకు ఓ చిన్నపాటి ట్రీట్ ఇద్దామని అనుకున్నాడు. అందుకోసమే ఆయన స్విగ్గీలో ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ పెట్టాడు. కానీ, ఆయనకు వచ్చిన కవర్ విప్పి చూసి తెల్లముఖం వేశాడు. తనకు వచ్చిన డెలివరీ కవర్ విప్పి చూస్తే అందులో రెండు డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయి. అదే విషయాన్ని ఆయన ఫొటోలు తీసి మరీ ట్వీట్ చేశాడు. స్విగ్గీ ఈ పొరపాటుపై రెస్పాండ్ అయింది. సమస్యను రిజాల్వ్ చేసింది.
కానీ, ఆ ట్వీట్‌కు మాత్రం విపరీతమైన ఆదరణ వస్తున్నది. సరదా కామెంట్లు పేలుతున్నాయి. ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ పెడితే కండోమ్ ప్యాకెట్లు వస్తే వచ్చాయి.. గానీ.. పాపం ఆ కండోమ్ ప్యాకెట్లకు ఆర్డర్ పెట్టిన వ్యక్తికి ఐస్ క్రీమ్ పోవడం ఎంతటి దురదృష్టం అంటూ కామెంట్లు పెట్టారు. పాపం ఐస్ క్రీమ్ రిసీవ్ చేసుకున్న అబ్బాయి గురించే నా బాధ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఆ అబ్బాయి ఎంతటి మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో కదా.. అంటూ ఇంకొకరు నిట్టూర్చారు. మూడ్ చంపేసే ఐస్ క్రీములు అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
కొందరు తమకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాలను ఏకరువు పెట్టారు. తాను కూడా ఒకసారి ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ పెడితే.. వాటితోపాటు కండోమ్ కూడా వచ్చిందని వివరించారు.