స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మొయిల్..

Published : Dec 09, 2020, 09:29 AM IST
స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మొయిల్..

సారాంశం

బాధితురాలి ఇంటికి కాంటిలాల్‌ అనే బీజేపీ కౌన్సిలర్‌ తరచు వచ్చేవాడు. ఈ క్రమంలో స్నానం చేస్తున్నప్పుడు తనను వీడియో తీశాడు

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. దానిని చూపించి బ్లాక్ మొయిల్ చేసి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జైపూర్ లో చోటుచేసుంది. జైపూర్ లోని బార్మర్ జిల్లాలోని బాల్టోరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా..  ఈ కేసులో నిందితుడిగా బీజేపీ నేత పేరు వినపడటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధితురాలు నాలుగు ఏళ్ల క్రితం బాల్టోరాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. బాధితురాలి ఇంటికి కాంటిలాల్‌ అనే బీజేపీ కౌన్సిలర్‌ తరచు వచ్చేవాడు. ఈ క్రమంలో స్నానం చేస్తున్నప్పుడు తనను వీడియో తీశాడు. దాంతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని, అంతేగాక అతని స్నేహితుడు జోధ్రామ్ తో కూడా సహజీవనం చేయాలని బలవంతం చేశాడు. 

ఈ మేరకు బాధఙతురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోను వైరల్‌ చేస్తానని బెదిరించి బాధితురాలిపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని డీఎస్పీ సుభాష్ ఖోజా పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

LPG గ్యాస్ వాడుతున్న వాళ్లకు షాకింగ్ న్యూస్.. జూన్ 30 లోగా ఈ పని చేయకపోతే సబ్సిడీ గోవిందా!
Nirmala Sitharaman Speech: వికసిత భారత్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ సూపర్ స్పీచ్| Asianet Telugu