లాక్ డౌన్ దెబ్బ: కొడుకుని చంపి శవం పక్కనే నిద్రపోయాడు

Published : Nov 30, 2020, 07:44 AM IST
లాక్ డౌన్ దెబ్బ: కొడుకుని చంపి శవం పక్కనే నిద్రపోయాడు

సారాంశం

లాక్ డౌన్ లో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి మానసికంగా క్రుంగిపోయి తన కన్నకుమారుడిని హత్య చేశాడు. ఆ తర్వాత శవం పక్కన నిద్రించాడు. ఈ విషయాన్ని నిద్రలేపి భార్యకు చెప్పాడు.

కాన్పూర్: ఓ వ్యక్తి తన కన్న కుమారుడిని చంపి శవం పక్కనే నిద్రపోయాడు. లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి మానసికంగా కృంగిపోయి ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో జరిగింది. 

శ్రీవాస్తవ అనే 43 ఏళ్ల వ్యక్తి తన భార్య సారిక, ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి కాన్పూర్ లోని సీసము ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. లాక్ డౌన్ లో అతని ఉద్యోగం పోయింది. దాంతో తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. సారిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 

శ్రీవాస్తవ తీవ్రమైన ఒత్తిడికి గురై కుమారుడు రుశాంక్ ను హత్య చేశాడు. ఆ తర్వాత శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భార్యను నిద్రలేపి విషయం చెప్పాడు. ఇప్పుడు మన కొడుుకుని ఎవరూ ఇబ్బంది పెట్టలేరని, అతడికి సమస్యలు ఉండవని, ప్రశాంతంగా ఉంటాడని భార్యకు చెప్పాడు.

దాంతో తీవ్రమైన ఆందోళనకు గురైన భార్య సారి వెంటనే బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. పోలీసులకు కూడా సమాచారం అందించింది. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి రుశాంక్ ను తన భర్త చంపేశాడని, ఆ తర్వాత ఇంట్లోని ఓ గదిలో కుమారుడి శవంతో నిద్రపోయాడని చెప్పింది. 

భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవాస్తవ తన నేరాన్ని అంగీకరించాడు. అతని కుమారుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?