బీహార్ లో దుర్గాదేవి విగ్రహం నిమజ్జనం: కాల్పులు, ఒకరి మృతి

By narsimha lodeFirst Published Oct 27, 2020, 5:42 PM IST
Highlights

బీహార్ రాష్ట్రంలో మంగర్ లో దుర్గాదేవి విగ్రహం నిమజ్జనం సందర్భంగా చెలరేగిన ఘర్షణలో 18 ఏళ్ల యువకుడు మరణించాడు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం నాడు చోటు చేసుకొంది.

పాట్నా: బీహార్ రాష్ట్రంలో మంగర్ లో దుర్గాదేవి విగ్రహం నిమజ్జనం సందర్భంగా చెలరేగిన ఘర్షణలో 18 ఏళ్ల యువకుడు మరణించాడు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం నాడు చోటు చేసుకొంది.

దుర్గామాత విగ్రహన్ని తీసుకెళ్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు జరగడానికి  ముందుకు ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.

18 ఏళ్ల యువకుడు మరణించాడు. అతని తల మొండెం నుండి వేరు చేసి ఉంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

సోమవారం నాడు దుర్గామాత విగ్రహం నిమజ్జనం చేసే సందర్భంగా సంఘ విద్రోహాశక్తులు పోలీసులను లక్ష్యంగా చేసుకొని రాళ్లు విసిరారు. ఈ సమయంలో దుర్గామాత విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్తున్న వలంటీర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ క్రమంలోనే పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు.

గుర్తు తెలియని వారు రాళ్లు విసరడంతో సుమారు 20 మంది పోలీసులు గాయపడ్డారు. అంతేకాదు ఇదే సమయంలో గుంపు మధ్యలో ఒకరు కాల్పులకు దిగాడు. దీంతో ఒకరు మరణించారని ముంగేర్ ఎస్పీ లిపి సింగ్ చెప్పారు.

పోలీసులపై కూడ కాల్పులు జరిపినట్టుగా ప్రచారం సాగింది. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నించామని  ఎస్పీ చెప్పారు.

మూడు పిస్టల్స్ , బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రజలను కొట్టామని పోలీసులపై తప్పుడు ప్రచారం సాగిందని  ఎస్పీ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నామన్నారు.

ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని అనురాగ్ పొద్దార్ గా గుర్తించారు. ఈ ఘటనపై చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. ఎన్డీఏలో చిరాగ్ భాగస్వామిగా ఉన్నారు.కానీ నితీష్ పార్టీకి వ్యతిరేకంగా  బీహార్ ఎన్నికల్లో పోటీకి దిగారు.

ముంగేర్ పోలీసులపై హత్యాయత్నం చేయాలని ఆయన  డిమాండ్ చేశారు. నితీష్ కుమార్ పాలనలో భక్తులపై కాల్పులు జరిపారన్నారు. పోలీస్ సూపరింటెండ్ ను సస్పెండ్ చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు.

బాధితుడి కుటుంబానికి రూ. 50 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు.

ఈ సంఘటనను ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ దుదృష్టకరమన్నారు. ఎన్నికల సంఘం  ఈ విషయమై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

click me!