మంచంకింద 6 గంటలు దాక్కుని.. భార్య ప్రియుడ్ని పొడిచి చంపిన భర్త.. !!

Published : Mar 26, 2021, 04:05 PM IST
మంచంకింద 6 గంటలు దాక్కుని.. భార్య ప్రియుడ్ని పొడిచి చంపిన భర్త.. !!

సారాంశం

భార్య వివాహేతర సంబంధం తెలిసిన భర్త హంతకుడిగా మారాడు. ఆరు గంటలపాటు మంచంకింద దాక్కుని భార్య ప్రియుడిని హతమార్చాడు.  పశ్చిమ బెంగళూరులోని ఆండ్రహల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

భార్య వివాహేతర సంబంధం తెలిసిన భర్త హంతకుడిగా మారాడు. ఆరు గంటలపాటు మంచంకింద దాక్కుని భార్య ప్రియుడిని హతమార్చాడు.  పశ్చిమ బెంగళూరులోని ఆండ్రహల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  హోసహల్లి తాండాకు చెందిన వినుతను భరత్ అనే వ్యక్తి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ నెలమంగళ దగ్గర్లోని ఓ కర్మాగారంలో పనిచేసేవాళ్లు. వీరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. 

ఈ క్రమంలో మూడేళ్ల క్రితం హోసహల్లి తాండాకు చెందిన శివరాజ్ ఉద్యోగం కోసం బెంగళూరులోని వీరి ఇంటికి వచ్చాడు. ఉద్యోగవేటలో వారం రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు. ఒకేఊరు వాడు కావడంతో శివరాజ్ కు వినుత ఉద్యోగం ఏర్పాటు చేసింది. 

అయితే వినుతకు అప్పటికే వివాహమై, ఇద్దరు పిల్లలున్నా శివరాజ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీన్ని ఆమె ఒప్పుకోలేదు. నిరాకరించింది. అయితే శివరాజ్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 

ఈ విషయం కొద్ది రోజులకు భర్తకు తెలిసింది. వినుతను నిలదీశాడు. దీంతో వినుత భర్తనుండి దూరంగా వెళ్లి ఒంటరిగా ఆంధ్రహళ్లిలో ఉంటోంది. శివరాజ్ అక్కడికి వారానికి ఒకట్రెండుసార్లు వచ్చి వెడుతుండేవాడు. ఈ క్రమంలో శివరాజ్ మీద భరత్ కోపం పెంచుకున్నాడు. 

పచ్చని తన సంసారాన్ని నాశనం చేసిన శివరాజ్ ను మట్టుపెట్టాలనుకున్నాడు. బుధవారం రాత్రి భరత్ ఎవరూ చూడకుండా వినుత ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో వినుత చికెన్ కోసం బైటికి వెళ్లింది. బెడ్రూంలోని మంచం కింద ఆరు గంటలపాటు దాక్కున్నాడు. 

తెల్లవారుజామున వినుత బాత్రూంకి వెళ్లడం చూసి.. డోర్ బైటినుంచి గడియ పెట్టాడు. ఆ తరువాత మంచంమీదున్న శివరాజ్ ను కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

భరత్ మీద కేసు నమోదు చేసుకున్నారు. అతనికోసం వెతకడం ప్రారంభించారు. అలా నెలామంగల పట్టణ శివారులో భరత్ ను అరెస్ట్ చేసినట్లు బైదరహల్లి పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families