పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి.. న‌గ్న వీడియో కాల్ రికార్డు చేసి..

By Mahesh Rajamoni  |  First Published Sep 11, 2023, 1:04 PM IST

Rourkela: ఆన్ లైన్ వేదిక‌గా ప‌రిచ‌యం ఏర్ప‌డి, కొంత‌కాలం త‌ర్వాత అది ప్రేమ‌గా మారింది. ఈ క్ర‌మంలోనే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన యువ‌కుడు.. ఆ యువ‌తికి సంబంధించిన ఒక న‌గ్న వీడియోతో బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టంతో పోలీసులు అరెస్టు చేశారు.
 


online video call: ఆన్ లైన్ వేదిక‌గా ప‌రిచ‌యం ఏర్ప‌డి, కొంత‌కాలం త‌ర్వాత అది ప్రేమ‌గా మారింది. ఈ క్ర‌మంలోనే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన యువ‌కుడు.. ఆ యువ‌తికి సంబంధించిన ఒక న‌గ్న వీడియోతో బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. పెళ్లి చేసుకుంటాన‌ని మాయ‌మాట‌లు చెప్పి ఒక మ‌హిళ స్నేహితురాలిని వీడియో కాల్ లో  బట్టలు విప్పించి.. ఆ క్లిప్ ను రికార్డ్ చేసి వైరల్ చేస్తానని బెదిరించిన 24 ఏళ్ల యువకుడిని సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని పూరిలో చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువతికి నాలుగు నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో నిందితుడు సునీల్ కుమార్ భోయ్ తో పరిచయం ఏర్పడిందనీ, వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత యువతిని పెళ్లి చేసుకుంటానని ఆ యువ‌కుడు మాటిచ్చాడు.

Latest Videos

ఆ తర్వాత సునీల్ ఆ మహిళకు తరచూ వీడియో కాల్స్ చేసి బట్టలు విప్పమని అడిగేవాడు. ఆ మహిళ కొన్నిసార్లు ఒప్పుకోవడంతో డిమాండ్లు పెరిగాయి. ప‌దే ప‌దే ఇలా బ‌ట్ట‌లు విప్ప‌మ‌ని అడిగేవాడు. దీంతో అందుకు యువతి నిరాకరించడంతో ఆమె బట్టలు విప్పుతున్న వీడియోను వైరల్ చేస్తానని సునీల్ బెదిరించాడు. దీంతో బాధితురాలు సెప్టెంబర్ 4న సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూరీ జిల్లా బ్రహ్మగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మకీర్తి గ్రామంలో సునీల్ ను అరెస్టు చేశారు.

click me!