క్షుద్రపూజలు : భార్యకు నగ్నంగా నలుగురిలో స్నానం..మగపిల్లాడు పుట్టాలని, డబ్బులు రావాలని భర్త దారుణం..!

Published : Aug 23, 2022, 06:37 AM IST
క్షుద్రపూజలు : భార్యకు నగ్నంగా నలుగురిలో స్నానం..మగపిల్లాడు పుట్టాలని, డబ్బులు రావాలని భర్త దారుణం..!

సారాంశం

వ్యాపారంలో డబ్బులు బాగా రావాలని.. మగపిల్లాడు పుట్టాలని ఓ భర్త దారుణానికి తెగించాడు. భార్యకు అందరిముందూ నగ్నంగా స్నానం చేయించాడు. 

మహారాష్ట్ర : డబ్బు ఆశ ఎంత నీచానికైనా దిగజారేలా చేస్తుంది. వావివరసలు, ఉచ్ఛనీచాలు మరిచి ప్రవర్తించేలా చేస్తుంది. అలాంటి సభ్య సమాజం తలదించుకునే అతి ఘోరమైన సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను డబ్బు మీద ఆశతో అందరిముందు నగ్నంగా నిలబెట్టిన స్నానం చేయించాడు ఓ ప్రబుద్ధుడైన భర్త. వ్యాపారంలో లాభాలు రావాలంటే, ఇంట్లో సుఖ శాంతులు నెలకొనాలంటే… మగపిల్లాడు పుట్టాలంటే.. క్షుద్ర పూజ చేయాలని ఎవరో చెప్పారు. ఆ  మాటలను గుడ్డిగా నమ్మాడు. ఆ తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టాడు.  

ఇందుకు అతని తల్లిదండ్రులు సైతం సహకరించారు.  ఈ క్రమంలో భర్త ఒత్తిడికి తలొగ్గిన బాధితురాలు.. ఏమీ చేయలేక అతను చెప్పినట్లు చేసింది. చుట్టుపక్కల ఉన్న వారు సైతం ఆ దారుణాన్ని చూస్తూ ఉన్నారు. తప్పా.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ తంతు ముగిసిన తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ విచారణ చేపట్టారు. అతని తల్లిదండ్రులను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సలహా ఇచ్చిన మాంత్రికుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

పాము కాటుతో కొడుకు మృతి.. బతికొస్తాడని 30 గంటలు పూజలు..

ఇలాంటి ఘటనలకు ఇది తొలి కాదు, అంతం కాదు.. ఎంతగా అవగాహన వస్తున్నా.. జరుగుతూనే ఉన్నాయి. జూన్ 28న ఝార్ఖండ్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. మానవత్వం మంటగలిసే.. వింటేనే కడుపులో దేవేసే హృదయ విదారక ఘటన jharkhandలోని గఢ్వా జిల్లాలో చోటు చేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళ సొంత సోదరినే హత్య చేసింది. ఆ తరువాత ఊహించని విధంగా ఆ మృతదేహంతో ప్రవర్తించింది. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. 

నగర్ ఉంటరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేలి గ్రామంలో లలితా దేవి తన భర్త దినేష్ ఓరన్ తో కలిసి జీవిస్తుంది. వీరిద్దరూ కలిసి ఓరన్  తోలాలోని రాంశరన్ నివాసానికి క్షుద్ర పూజలు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన లలితాదేవి సోదరి గుడియాదేవి, ఆమె భర్త మున్నాతో కలిసి వచ్చింది. గుడియా దేవి వచ్చిన వెంటనే లలితా దేవి మంత్రాలు చదవడం ప్రారంభించింది. ఆమె భర్త  గుడియాను కర్రతో కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం పడిపోయిన ఆమెను.. లలిత, ఆమె భర్త కలిసి  ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ తర్వాత ఆమె నాలుక కత్తిరించారు.

అక్కడితో ఆగకుండా ఆమె ప్రైవేట్ భాగాలలో చేతులు పెట్టి పేగులు బయటకు తీశారు. ఇంత దారుణానికి పాల్పడుతున్నాఅక్కడే ఉన్న గుడియా భర్త కానీ, మిగతా బంధువులు కానీ ప్రేక్షకులలాగా చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని అడవి మధ్యలోకి తీసుకువెళ్లి దహనం చేశారు. ఈ విషయాన్ని గుడియా భర్త  మున్నా.. గ్రామ పెద్దలకు తెలియజేశాడు. దీంతో పంచాయతీ పెట్టగా.. వార్డు కౌన్సిలర్ భర్త దీనిని కప్పిపుచ్చేందుకు  ప్రయత్నించాడు. ఆ తరువాత విషయం బయటకు రావడంతో పోలీసులకు సమాచారం అందింది.  మరోవైపు, మున్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేష్ ఓరన్, రాంశరన్ ఓరన్,  లలితాదేవి ఐదుగురిని అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !