పెళ్లైన మూడు నెలలకే.. భార్యను గొడ్డలితో నరికి, భర్త కూడా...

Published : Sep 06, 2021, 12:31 PM IST
పెళ్లైన మూడు నెలలకే.. భార్యను గొడ్డలితో నరికి, భర్త కూడా...

సారాంశం

ఏమైందో.. ఏమో తెలియదు కానీ భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ విషాద ఘటన ఒరిస్సా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లాలోని సొడక్ గ్రామంలో.. బిపిన్, లలికి ఈ యేడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. 

ఒరిస్సా : భువనేశ్వర్ లో దారుణం జరిగింది. పెళ్లైన మూడు నెలలకే భార్యను దారుణంగా చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి.  కలకాలం కలిసుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని మొదలెట్టారు. కానీ అంతలోనే విషాదం అలుముకుంది. 

ఏమైందో.. ఏమో తెలియదు కానీ భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ విషాద ఘటన ఒరిస్సా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లాలోని సొడక్ గ్రామంలో.. బిపిన్, లలికి ఈ యేడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. 

కూతురిపై తండ్రి అత్యాచారం.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు..!

అయితే ఇటీవల కొంతకాలం నుంచి వారు తరచుగా గొడవపడేవారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలదు కానీ, బిపిన్ తన భార్యను గొడ్డలితో నరికేసి, ఆ తరువాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం బిపిన్ తండ్రి ఇంట్లోకి రాగానే వీరిద్దరూ విగత జీవులుగా ఉండడం చూస పోలీసులకు, లిలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ హత్య, ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంట కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport