ఎక్స్ లవర్‌పై పగ తీర్చుకోవాలని ఆమె పేరిట ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన యువకుడు.. ఏం చేశాడంటే?

Published : Mar 05, 2023, 04:54 PM IST
ఎక్స్ లవర్‌పై పగ తీర్చుకోవాలని ఆమె పేరిట ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన యువకుడు.. ఏం చేశాడంటే?

సారాంశం

ఢిల్లీలో  ఓ వ్యక్తి తన ఎక్స్ లవర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె పేరిట ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. తండ్రి ఫొటోను ఉపయోగించాడు. ఆ ఫేక్ అకౌంట్‌తో ఆమె బంధువులకు అసభ్యకర సందేశాలు పంపాడు.   

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ యువకుడు తన మాజీ లవర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె పేరిట ఓ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆమె తండ్రి ఫొటోనూ ఇన్‌స్టా అకౌంట్‌కు ఉపయోగించుకున్నాడు. ఆ ఫేక్ ఇన్‌స్టా అకౌంట్‌తో వారి బంధువులకు, ఆమెకు అసభ్యకర మెస్సేజీలు పంపించాడు. ఇలా చేసి ఆమె పరువు దెబ్బ తీయాలని, వారి కుటుంబంలోనే తల ఎత్తుకోలేకుండా చేయాలని భావించాడు. పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఫేక్ ఇన్‌స్టా తయారు చేయడానికి వాడిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని వివేక్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన దక్షిణ ఢిల్లీ నజాఫ్‌గడ్ ఏరియా నివాసి. వివేక్ ఓ యువతితో నాలుగేళ్లు ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత వారి ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాలతో విడిపోయారు. అనంతరం, తన ఎక్స్ లవర్ పై పగ తీర్చుకోవాలని వివేక్ అనుకున్నాడు. అందుకే ఆమె పేరును, ఆమె తండ్రి ఫొటోను ఉపయోగించుకుని నకిలీ ఇన్‌స్టా ఖాతా క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్‌తో ఆమె బంధువులకు, ఆమెకు అభ్యంతరకర మెస్సేజీలు పంపించాడు. 

Also Read: 13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శృంగారం, గర్భం దాల్చిన ఆమె ప్రసవం.. జైలు నుంచి విడుదల

ఆ మెస్సేజీలు చూసి తీవ్ర ఆందోళనకు గురైన ఆ యువతి సైబర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ద్వారకా డీసీపీ ఎం హర్ష వర్ధన్ మాట్లాడుతూ, ఆ ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ ఎనాలిసిస్ చేస్తే అందుకు ఉపయోగించిన ఫోన్ నెంబర్ తెలియవచ్చిందని, ఆ ఫోన్ నెంబర్ వివేక్‌కు చెందినదని వెల్లడైందని వివరించారు.

గతంలో వారిద్దరూ నాలుగేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఆ తర్వాత విడిపోయారని హర్షవర్దన్ తెలిపారు. పగ తీర్చుకోవడానికి, ఆమెను డిఫేమ్ చేయడానికి ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేశాడని చెప్పారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశామని వివరించారు. అతని వద్ద నుంచి ఆ ఫోన్‌ను రికవరీ చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu