మరదలు స్నానం చేస్తుండగా వీడియో తీసి, బ్లాక్ మెయిల్.. కొట్టి, లొంగదీసుకున్న బావ.. చివరికి...

Published : Jan 19, 2022, 01:32 PM IST
మరదలు స్నానం చేస్తుండగా వీడియో తీసి, బ్లాక్ మెయిల్.. కొట్టి, లొంగదీసుకున్న బావ.. చివరికి...

సారాంశం

కొంతకాలం క్రితం ఆమె స్నానం చేస్తుండగా నిందితుడు.. తనకు తెలియకుండా వీడియో చిత్రీకరించాడని, ఆ తర్వాత ఆ వీడియో క్లిప్‌ని చూపించి.. తనతో సంబంధం పెట్టుకోమని, తన కోరిక తీర్చమని కోరుతూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆమె దీనికి నిరాకరించడంతో అతను వేధించడం ఇంకా ఎక్కువ చేశాడు. 

పూణే : Puneలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరదలు స్నానం చేస్తుండగా video తీసి blackmail చేశాడు. ఆమెపై దాడిచేసి.. కామవాంఛ తీర్చుకున్నాడు. అతనిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను ఆమెను తన కోరిక తీర్చమంటూ బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా, కొట్టి, forcefully ఆమెను లొంగదీసుకున్నాడు. దీంతో ఆగితే విషయం వెలుగులోకి రాకపోయేది. కానీ అతను తిరిగి మళ్లీ అదే బుద్ది చూపిస్తుండడంతో.. సదరు victim పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదయ్యింది. 

పూనెలోని పర్భానీ జిల్లాకు చెందిన నిందితుడిపై శనివారం బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా హింజేవాడి పోలీసులకు case నమోదు చేసినట్లు సమాచారం. కొంతకాలం క్రితం ఆమె స్నానం చేస్తుండగా నిందితుడు.. తనకు తెలియకుండా వీడియో చిత్రీకరించాడని, ఆ తర్వాత ఆ వీడియో క్లిప్‌ని చూపించి.. తనతో సంబంధం పెట్టుకోమని, తన కోరిక తీర్చమని కోరుతూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ఆమె దీనికి నిరాకరించడంతో అతను వేధించడం ఇంకా ఎక్కువ చేశాడు. ఎంతకీ ఆమె లొంగకపోవడంతో.. అతను ఆమెను కొట్టి బలవంతంగా.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గత నెలలో జరిగింది. అప్పటికి ఈ విషయాన్ని ఆమె భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. అయితే, ఆ వ్యక్తి తనను మరోసారి వేధించడం ప్రారంభించే సరికి ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో ఆ మహిళ జరిగిన ఘోరాన్ని తన భర్తకు  వివరించింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. అలా అతని మీద కేసు నమోదు చేశారు.

అయితే పోలీసులు అతడిని పట్టుకునేలోపే నిందితుడు పర్భానీ జిల్లాలోని తన స్వగ్రామానికి పారిపోయాడు. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. "మేము అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారానికి శిక్ష,  323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసాం" అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, డిసెంబర్ 28న మంగళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. తీరప్రాంత నగరం మంగళూరులో ఈ దారుణం వెలుగుచూసింది.  నాలుగేళ్ల నుంచి ఒక యువతికి drugs ఇచ్చి Sexual assaultకి పాల్పడుతున్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  మంగళూరు నగరంలోని బిజై ప్రాంతానికి చెందిన మహిళ తన కూతురికి కొందరు డ్రగ్స్ కు అలవాటు చేసి లైంగికంగా వాడుకున్నట్లు ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది.  గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

కూతురిని ఇలా నాశనం చేశారని మీడియా ముందు విలపించింది. కూతురు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపింది. ఆమెను కాపాడాలని విహెచ్పి నాయకులను కూడా ఆశ్రయించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపి  సురత్కల్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్  (47) అనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అతనికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్లు తేలింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu