మధురైలో దారుణం: పాత కక్షలతో ఓ వ్యక్తి హత్య, తల తీసుకెళ్లిన దుండగులు

Published : Nov 16, 2020, 02:42 PM IST
మధురైలో దారుణం: పాత కక్షలతో ఓ వ్యక్తి హత్య, తల తీసుకెళ్లిన దుండగులు

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో పాతకక్షలతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చారు ప్రత్యర్ధులు. ఈ ఘటనలో మరో వ్యక్తి  పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.  

మధురై: తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో పాతకక్షలతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చారు ప్రత్యర్ధులు. ఈ ఘటనలో మరో వ్యక్తి  పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో పట్టపగలే పాతకక్షలతో ప్రత్యర్దులు మురుగానందం అనే వ్యక్తిని రోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశారు.

కారులో వచ్చిన  దుండగులు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిపై కత్తులతో దాడికి దిగారు.రోడ్డుపై పడి కొన ఊపిరితో కొట్టుకొంటున్న వ్యక్తి తల నరికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ దృశ్యాలను రోడ్డుపై వెళ్తున్న వారు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

మురుగనందాన్ని హత్య చేసింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే మురుగనందాన్ని హత్యచేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం .ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu
Liquor sales: మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌. కార‌ణం ఏంటంటే.?