మతిస్థిమితం లేని కూతురిపై కన్నేసిన తండ్రి.. గర్భం దాల్చడంతో...

Published : May 18, 2020, 09:08 AM ISTUpdated : May 18, 2020, 09:16 AM IST
మతిస్థిమితం లేని కూతురిపై కన్నేసిన తండ్రి.. గర్భం దాల్చడంతో...

సారాంశం

కొద్దిరోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, కుటుంబసభ్యుల్ని విచారించగా యువతి గర్భానికి గల కారణాలను వారు చెప్పలేకపోయారు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కాటేశాడు. అభం శుభం తెలియని కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కనీసం కుమార్తెకు మతిస్థిమితం కూడా లేదన్న కనికరం లేకుండా ప్రవర్తించాడు. కాగా.. ఆ కీచక తండ్రి కారణంగా యువతి గర్భం కూడా దాల్చడం గమనార్హం. ఈ దారుణ సంఘటన  హర్యానా పంచుకులాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  పంచు‌కుల జిల్లాలోని సెక్టార్‌ 18 పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఓ వ్యక్తి మానసిక వికలాంగురాలైన 23 ఏళ్ల తన కూతురిపై తరచుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, కుటుంబసభ్యుల్ని విచారించగా యువతి గర్భానికి గల కారణాలను వారు చెప్పలేకపోయారు.

పోలీసులకు బాధితురాలి తండ్రిపై అనుమానం కలగటంతో అతడ్ని విచారించారు. దీంతో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఓ సంవత్సర కాలంగా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు. అనంతరం అతడిపై రేప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని బాధితురాలు వాపోతుండటం గమనార్హం

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu