కేంద్రానికి మమత లేఖ: స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నిర్మలా సీతారామన్

By narsimha lodeFirst Published May 9, 2021, 5:18 PM IST
Highlights

కరోనాకు సంబంధించిన మందులు, ఇతర వాటిపై జీఎస్టీతో పాటు ఇతర పన్నులను  ఎత్తివేయాలని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రధాని మోడీకీ లేఖ రాశారు.అయితే  కేంద్రం ఇప్పటికే వీటిపై పన్ను మినహాయింపు ఇచ్చినట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  మమత బెనర్జీకి  సమాధానమిచ్చారు. 
 

కోల్‌కత్తా: కరోనాకు సంబంధించిన మందులు, ఇతర వాటిపై జీఎస్టీతో పాటు ఇతర పన్నులను  ఎత్తివేయాలని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రధాని మోడీకీ లేఖ రాశారు.అయితే  కేంద్రం ఇప్పటికే వీటిపై పన్ను మినహాయింపు ఇచ్చినట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  మమత బెనర్జీకి  సమాధానమిచ్చారు. 

&nb

7/ This exemption applies to all above mentioned goods when imported free of cost for free distribution in the country by any entity, State Govt, relief agency or autonomous body on the basis of a certificate issued by a State Government.

— Nirmala Sitharaman (@nsitharaman)

sp;

 

కరోనాకు సంబంధించిన మెడికల్ పరికరాలు, మందులు ఇతరత్రావాటిపై కస్టమ్స్, జీఎస్టీ పన్నును మినహాయించాలని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాశారు.  ఈ విషయమై బెంగాల్ సీఎం మమతకు కేంద్ర మంత్రి నిర్మాల సీతారామన్ రిప్లై ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆమె తన సమాధానం ఇచ్చారు. 

 

1/ Hon. CM of West Bengal has written to the Hon seeking exemption from GST/Customs duty and other duties and taxes on some items and COVID related drugs.

My response is given in the following 15 tweets. pic.twitter.com/YmcZVuL7XO

— Nirmala Sitharaman (@nsitharaman)

రాష్ట్రంలో కరోనా విషయంలో ప్రభుత్వానికి సహాయంగా స్వచ్ఛంధ సంస్థలు, వ్యక్తులు, సంస్థలు కరోనాకు సంబంధించిన మందులు, మెడికల్ పరికరాలు  ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.అయితే వీటికి సంబంధించిన పన్నులను మినహాయించాలని కోరారు. మమత బెనర్జీకి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ఈ నెల 3వ తేదీన  వీటికి సంబంధించి పన్ను మినహాయింపు ఇచ్చిన విషయాన్నినిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. 

ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్స్, మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్, ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంకులు, ఆక్సిజన్ జనరేటర్స్  తదితర వాటిపై పన్నును మినహాయించినట్టుగా నిర్మలా సీతారామన్  చెప్పారు.  పన్ను మినహాయించిన వస్తువుల జాబితాను ట్విట్టర్ లో నిర్మలా సీతారామన్  జత చేశారు. 

click me!