నందిగ్రామ్‌: నాడు లెఫ్ట్‌ప్రంట్‌కు, నేడు సువేంద్‌పై మమత దెబ్బ

By narsimha lodeFirst Published May 2, 2021, 5:30 PM IST
Highlights

బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్లపాటు అప్రతిహతంగా కొనసాగిన లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వం కూలిపోవడానికి  నందిగ్రామ్ భూపోరాటం కీలకపాత్ర పోషించింది. అయితే నేడు అదే నందిగ్రామ్ లో  బీజేపీని మట్టికరిపించారు.

కోల్‌కత్తా: బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్లపాటు అప్రతిహతంగా కొనసాగిన లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వం కూలిపోవడానికి  నందిగ్రామ్ భూపోరాటం కీలకపాత్ర పోషించింది. అయితే నేడు అదే నందిగ్రామ్ లో  బీజేపీని మట్టికరిపించారు.బెంగాల్ రాష్ట్రంలో బుద్దదేవ్ భట్టాచార్య సీఎంగా ఉన్న సమయంలో రసాయన సెజ్ ఏర్పాటు చేశారు. 2007లో బుద్దదేవ్ భట్టాచార్య సర్కార్ నందిగ్రామ్ లో సెజ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ సెజ్ ను నిరసిస్తూ పెద్ద ఎత్తున పోరాటం సాగింది. ఈ పోరాటానికి టీఎంసీ మద్దతుగా నిలిచింది. నందిగ్రామ్ లో ప్రస్తుత బీజేపీ నేత ఒకప్పటి మమత బెనర్జీ ప్రధాన అనుచరుడు సువేంధు అధికారి ఈ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. 

also read:నెగ్గిన పంతం: బీజేపీపై సవాల్ విసిరి తొడగొట్టి గెల్చిన ప్రశాంత్ కిషోర్

ఈ పోరాటంలో అప్పట్లో మావోయిస్టులు కూడ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీఎంసీతో పాటు మావోయిస్టులు మద్దతుగా పోరాటాలు నిర్వహించినట్టుగా లెఫ్ట్ ఫ్రంట్  ఆరోపించింది. ఈ పోరాటం సాగిన సందర్భంగా పోలీసుల కాల్పుల్లో అప్పట్లో 14 మంది మరణించారు.  నందిగ్రామ్ భూ పోరాటం సమయంలో క్షేత్రస్థాయిలో ప్రత్యర్ధులు సీపీఎం నేతలపై దాడులకు పాల్పడ్డారని అప్పట్లోనే ఆ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్ తో పాటు కొన్ని నియోజకవర్గాల్లో సువేందు అధికారి కుటుంబానికి మంచి పట్టుంది. ఆయన కుటుంబసభ్యులు ఎంపీలు, ఎమ్మెల్యలుగా కూడ ఉన్నారు. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సువేందు అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధిపై సువేంద్ అధికారి 81 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.బీజేపీలో చేరిన తర్వాత నందిగ్రామ్ లో మమత బెనర్జీ పోటీ చేస్తే 50వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని సువేంద్ అధికారి హెచ్చరించారు. దీంతో నందిగ్రామ్ లో నే తాను పోటీ చేస్తానని మమత బెనర్జీ ప్రకటించారు. ఈ ఒక్క స్థానం నుండే ఆమె బరిలోకి దిగారు. రెండో స్థానం నుండి పోటీ చేస్తే ఈ స్థానంలో ఓటమి భయంతో మరో స్థానం నుండి పోటీ చేశారనే ప్రచారం సాగేది. అందుకే నందిగ్రామ్ నుండి మాత్రమే ఆమె పోటీ చేసింది.  

నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో తన మాజీ అనుచరుడు, తాజా శతృవు సువేంద్ అధికారిపై 1200 ఓట్లతో ఆమె విజయం సాధించారు. నందిగ్రామ్ పోరాటం ద్వారా  లెఫ్ట్ ప్రంట్  ప్రభుత్వానికి మమత చుక్కలు చూపారు. ఇదే నందిగ్రామ్ లో విజయం సాధించడం ద్వారా  సువేంద్ ను ఓడించి  బీజేపీకి తన దెబ్బను చూపారు. బెంగాల్ ఎన్నికల్లో   టీఎంసీని విజయతీరాలకు చేర్చడంలో మమత బెనర్జీ కీలకపాత్ర పోషించారు. 


 

click me!