మమతా స‌ర్కారుకు పాలించే నైతిక హక్కు లేదు: స్కూల్ ఉద్యోగాల కుంభకోణంపై ఆప్ నిరసనలు

By Mahesh RajamoniFirst Published Aug 7, 2022, 11:57 PM IST
Highlights

West Bengal AAP protests: స్కూల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో సస్పెన్షన్ కు గురైన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకులు అర్పితా ముఖర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. 
 

WB school jobs scam: ప‌శ్చిమ బెంగాల్ లో పాఠశాల ఉద్యోగాల కుంభకోణం (school jobs scam) రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తృణ‌మూల్ కాంగ్రెస్ స‌ర్కారుకు ఈ అంశాలు ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో మ‌మ‌తా బెన‌ర్జీ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్ష భార‌తీయ జ‌న‌తా పార్టీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఇక నిన్న‌టివ‌ర‌కు కొన్ని విష‌యాల్లో ఒక్క‌టిగా క‌నిపించిన ఆమ్ ఆద్మీ (ఆప్‌), తృణ‌మూల్ కాంగ్రెస్ లు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ముందుకు సాగాయి. ఇక తాజాగా బెంగాల్ ఆప్ యూనిట్.. మ‌మ‌తా బెన‌ర్జీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లకు దిగింది. టీఎంసీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగించింది. దీనికి ప్ర‌ధాని కార‌ణం రాష్ట్రంలో ఇటీవ‌ల వెగులులోకి వ‌చ్చిన పాఠ‌శాల ఉద్యోగాల కుంభ‌కోణం. 

వివ‌రాల్లోకెళ్తే.. పాఠశాల ఉద్యోగాల కుంభకోణంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పశ్చిమ బెంగాల్ యూనిట్ ఆదివారం (ఆగస్టు 7) నిరసన వ్యక్తం చేస్తూ.. ర్యాలీలు నిర్వ‌హించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేసేందుకు ఆప్ మద్దతుదారులు కోల్‌కతాలో 'దుర్నితిర్ సర్కార్ ఆర్ నేయి దోర్కర్' (ఈ అవినీతి ప్రభుత్వం వద్దు) అని రాసి ఉన్న ప్లకార్డులతో వీధుల్లోకి వచ్చారు. 2 వేల మంది ఆప్ కార్యకర్తలు రాంలీలా మైదాన్ నుంచి మేయో రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అవినీతి స‌ర్కారుకు పాలించే హ‌క్కులేదంటూ నిన‌దించారు.

বাংলায় ক্রমাগত নিয়োগ দুর্নীতির বিরুদ্ধে আজ রাজপথে বিভিন্ন জেলা থেকে আগত কর্মীদের নিয়ে -এর এক বিশাল । যেখানে দুর্নীতি থাকবে সেখানেই আমরা গর্জে উঠব। pic.twitter.com/wJp3bdYKH7

— Aam Aadmi Party West Bengal (@AamAadmiPartyWB)

స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసులో ఇప్పుడు సస్పెండ్ చేయబడిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సహాయకురాలు అర్పితా ముఖర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన నేపథ్యంలో నిరసనలు వచ్చాయి. TMC పార్థ ఛటర్జీని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆయ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే టీఎంసీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. పార్టీ ప్రధాన కార్యదర్శి,  జాతీయ ఉపాధ్యక్షుడితో సహా అన్ని పార్టీ పదవుల నుండి తొలగించింది. "ఒక TMC అగ్ర‌నేత అరెస్టుతో పాటు ఆయ‌న మహిళా స్నేహితురాలికి చెందిన రెండు ఫ్లాట్ల నుండి భారీ మొత్తంలో నగదు రికవరీ తర్వాత.. ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే నైతిక హక్కు లేదు. మా ఈ భారీ నిర‌స‌న ర్యాలీ మరోసారి ఈ డిమాండ్‌ను లేవనెత్తుతోంది" అని ఒక బెంగాల్ ఆప్ నాయకుడు పేర్కొన్నార‌ని పీటీఐ నివేదించింది. ఇదిలా ఉండగా, ఆగస్టు 5న కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సహాయకురాలు అర్పితా ముఖర్జీలను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆగస్టు 18న తదుపరి విచారణకు రావాలని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు తెలిపింది.

click me!